Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఒకే కుటుంబంలో ఐదుగురి ఆత్మహత్య.. ఎక్కడ?

Advertiesment
suicide

ఠాగూర్

, గురువారం, 21 ఆగస్టు 2025 (10:22 IST)
హైదరాబాద్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. స్థానిక మియాపూర్‌లో ఐదుగురు మృతి చెందారు. ఇది స్థానికంగా కలకలం రేపింది. మియాపూర్‌లోని ఓ ఇంటిలోని ఒకే కుటుంబానికి చెందిన వారిగా స్థానికులు చెబుతున్నారు. 
 
దీనిపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపరీక్ష కోసం ఆస్పత్రికి తరలించారు. మృతులను కర్నాటక గుల్బర్గా జిల్లా సేడం మండలం రంజోలికి చెందిన లక్ష్మయ్య (60), వెంకటమ్మ (55), అనిల్ (32), కవిత (24)గా గుర్తించారు. వీరితోపాటు ఓ రెండేళ్ల చిన్నారి కూడా మృతి చెందినట్టు పోలీసులు చెబుతున్నారు. 
 
పవన్ కళ్యాణ్‌ అంత పని చేశారా? హైకోర్టులో పిటిషన్ 
 
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్‌కు వ్యతిరేకంగా ఏపీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. పవన్ నటించిన తాజాగా చిత్రం "హరిహర వీరమల్లు" చిత్రం. గత నెల 24వ తేదీన విడుదలైంది. అయితే, ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల కోసం పవన్ కళ్యాణ్ ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టేందుకు హైకోర్టు సమ్మతించింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, మాజీ ఐఏఎస్ అధికారి ఎస్.విజయకుమార్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. పవన్ కళ్యాణ్ తన సొంత సినిమా 'హరిహర వీరమల్లు' కోసం ప్రభుత్వ నిధులను వాడుకున్నారని ఆయన తన పిటిషన్‌లో ఆరోపించారు. ఈ వ్యవహారంపై కేంద్రం దర్యాప్తు సంస్థ సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు.
 
విజయ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు... దానిని విచారణకు స్వీకరించడంతో పాటు కీలక ఆదేశాలు జారీచేసింది. ఈ కేసు విచారణ జాబితాలో సీబీఐ, ఏసీబీ న్యాయవాదుల పేర్లను కూడా చేర్చాలని రిజిస్ట్రీకి కోర్టు సూచన చేసింది. ఆ తర్వాత తదుపరి విచారణను వారం రోజులకు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. 
 
ఏపీ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇలాంటి పిటిషన్ దాఖలు కావడం, దాన్ని హైకోర్టు విచారణకు స్వీకరించడం ఇపుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Pawan Kalyan: శ్రీశైలం అటవీ ప్రాంతంలో ఘర్షణ.. పవన్ కల్యాణ్ సీరియస్