Webdunia - Bharat's app for daily news and videos

Install App

హ‌త్య‌లు ఛేదించే`క‌ప‌ట‌ధారి`పోలీసుగా సుమంత్‌

Webdunia
శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (19:38 IST)
Sumanth, Kapatadhaari,nazar
సుమంత్‌ హీరోగా ప్ర‌దీప్ కృష్ణ‌మూర్తి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న థ్రిల్లర్‌`క‌ప‌ట‌ధారి`. `సుబ్ర‌హ్మ‌ణ్య‌పురం`, `ఇదంజ‌గ‌త్‌` చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ను సొంతం చేసుకున్న సుమంత్ ఇప్పుడు `క‌ప‌ట‌ధారి` అనే స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌లో న‌టిస్తున్నారు. క‌న్న‌డంలో సూప‌ర్‌హిట్ట‌యిన `కావ‌లుధారి` సినిమాకు ఇది తెలుగు రీమేక్‌. క్రియేటివ్ ఎంట‌ర్‌టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూట‌ర్స్ బ్యాన‌ర్‌పై కపటధారి చిత్రాన్ని డా.ధ‌నంజ‌యన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 19న విడుదల చేస్తున్నారు. 
 
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత డా.ధ‌నంజ‌యన్ మాట్లాడుతూ, ``కొత్త క‌థాంశాలతో రూపొందే చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఎలా ఆద‌రిస్తారో అంద‌రికీ తెలిసిందే. ఆ న‌మ్మ‌కంతోనే క‌ప‌ట‌ధారి నిర్మించాం. సుమంత్‌గారు త‌న పాత్ర‌లో అద్భుతంగా ఒదిగిపోయారు. నాజ‌ర్‌, సంప‌త్ రాజ్, జ‌య‌ప్ర‌కాశ్‌, నందిత అందరి పాత్ర‌లు చాలా ఆస‌క్తిక‌రంగా ఉంటాయి. సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్ మూవీగా క‌ప‌ట‌ధారి సినిమాను రూపొందించాం. చాలా ఏళ్ల క్రితం జ‌రిగిన హ‌త్య‌ల‌ను ఓ పోలీస్ ఆఫీస‌ర్ ఎలా ఛేదించాడ‌నేదే ఈ సినిమా క‌థాంశం. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. సినిమాను ఫిబ్ర‌వ‌రి 19న భారీగా విడుద‌ల చేస్తున్నాం`` అన్నారు. నందిత‌, పూజాకుమార్‌, నాజ‌ర్‌, జ‌య‌ప్ర‌కాశ్‌, సంప‌త్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు.
 
సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం:  ప్ర‌దీప్ కృష్ణ‌మూర్తి
నిర్మాత‌:  డా.జి.ధ‌నంజ‌య‌న్‌
యాక్ష‌న్‌: స‌్టంట్ సిల్వ‌
మ్యూజిక్‌:  సైమ‌న్ కె.కింగ్‌
ఆర్ట్‌:  విదేశ్‌
ఎడిటింగ్‌:  ప్ర‌వీణ్ కె.ఎల్‌
మాట‌లు:  బాషా శ్రీ
స్క్రీన్ ప్లే అడాప్ష‌న్‌:  డా.జి.ధ‌నంజ‌య‌న్‌
క‌థ‌:  హేమంత్ ఎం.రావు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉత్తమ విద్యా వ్యవస్థ.. సమగ్ర విధాన పత్రం సిద్ధం చేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి

వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం.. ముస్లిం సోదరుల హర్షం.. ప్రధాని పేరును సువర్ణాక్షరాల్లో?

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments