Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నల్లమల.. ఎరుపెక్కే గ్రహణమిది రవికెరుగని గగనం..

Advertiesment
నల్లమల.. ఎరుపెక్కే గ్రహణమిది రవికెరుగని గగనం..
, బుధవారం, 13 జనవరి 2021 (16:25 IST)
nazar
నల్లమల.. ఈ పేరు వినగానే ఎన్నో గుర్తొస్తాయి. ఆ నేపథ్యంలో ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. ఆ సినిమాలకు పూర్తి భిన్నంగా రూపొందుతున్న చిత్రం "నల్లమల". నల్లమల చుట్టూ ఉన్న ఎన్నో చీకటి కోణాలను స్పృశిస్తూ.. అక్కడి వారి జీవితాలను దారుణంగా ప్రభావితం చేస్తున్న అనేకమంది మోసాలను బట్టబయలు చేస్తూ తెరకెక్కుతున్న డేరింగ్ మూవీ ఇది. 
 
ఇప్పటివరకు ఇలాంటి కథాంశం తో తెలుగులో సినిమా రాలేదనే చెప్పాలి. కథే హీరోగా రూపొందుతున్న నల్లమల మూవీ నుంచి మొదటి వీడియో సాంగ్ విడుదల అయింది.  ప్రముఖ నటుడు నాజర్ చేతుల మీదుగా ఈ టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. పెద్దపల్లి రోహిత్ సంగీతంలో
"ఎరుపెక్కే గ్రహణమిది రవికెరుగని గగనం..
ఎదురొచ్చే శకలాలను పెకలించే పర్వం..
నిజాల చాటు నీలి నీడని..
సవాలు చేసే సమిధలం అనీ.. " అంటూ అత్యంత పవర్ఫుల్ గా ఉందీ పాట.
 
ఈ సందర్భంగా నాజర్ మాట్లాడుతూ.. "పాట అద్భుతంగా ఉంది. ఈ సినిమాలో నా పాత్ర చాలా బావుంటుంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమాలో నటించిన ఫీలింగ్ వచ్చింది. గొప్ప కథతో రూపొందుతున్న చిత్రం ఇది. ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తుంది" అన్నారు.
 
ఈ పాటలోని లిరికల్ వాల్యూ చూస్తేనే సినిమా రేంజ్ తెలిసిపోతుందని చెప్పొచ్చు. విన్న ప్రతి ఒక్కరూ అద్భుతమైన పాట అని మెచ్చుకుంటున్నారు.
ప్రస్తుతం చాలా వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న నల్లమల చిత్రం లో అమిత్ తివారీ, భానుశ్రీ, నాజర్, తనికెళ్ల భరణి, అజయ్ ఘోష్, కాలకేయ ప్రభాకర్, ఛత్రపతి శేఖర్, ఛలాకీ చంటి, ముక్కు అవినాశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
 
సాంకేతికంగానూ హై స్టాండర్డ్స్‌లో నిలిచే ఈ మూవీకి
ఎడిటర్ : శివ సర్వాణి
ఫైట్స్ : నబా
విఎఫ్ఎక్స్ : విజయ్ రాజ్
ఆర్ట్ : యాదగిరి
పి.ఆర్.వో : దుద్ది శ్రీను
సినిమాటోగ్రఫీ : వేణు మురళి
సంగీతం, పాటలు : పి.ఆర్
నిర్మాత : ఆర్.ఎమ్

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌పై దాడి చేస్తాం : బండి సంజయ్ హెచ్చరిక