Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీజే చిత్ర కాల్స్.. అదే మొదటి.. చివరి చిత్రం.. ట్రైలర్ అదుర్స్ (video)

Webdunia
శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (18:47 IST)
Calls
బుల్లితెర నటి వీజే చిత్ర నటించిన మొదటి చివరి చిత్రం 'కాల్స్‌'.. ఇదే ఆమె చిత్రం కూడాను. ఈ మూవీని క్రైమ్‌ థ్రిల్లర్‌, సోషియో డ్రామాగా తెరకెక్కించారు. ఈ చిత్ర ట్రైలర్‌ ఇటీవల విడుదలకాగా, దానికి మంచి స్పందన లభించింది. ఇప్పటికే మిలియన్‌ నెటిజన్లు దీనిని వీక్షించారు. బుల్లితెరలో అనేక సీరియల్స్‌లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న వీజే చిత్ర గత ఏడాది ఆత్మహత్య చేసుకుంది. 
 
ఈ క్రమంలో ఆమె నటించిన 'కాల్స్‌' విడుదలకు సిద్ధమవుతుంది. ఆమె మరణానంతరం విడుదలైన ఈ చిత్రం ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందని, ఈ సినిమాను ఆమెకు అంకితమిస్తున్నామని నిర్మాతలు తెలిపారు. జె.శబరీష్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్‌.జయకుమార్‌, జె.కావేరి సెల్వి, జె.శబరీష్‌ సంయుక్తంగా నిర్మించగా, తమీమ్‌ అన్సారీ సంగీతం సమకూర్చారు.  
 
ఇన్‌ఫైనైట్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై ఎస్‌.జయకుమార్‌, జే. కావేరి సెల్వి నిర్మాణంలో 2019 జూలైలో ‘కాల్స్‌’ చిత్రం షూటింగ్‌ ప్రారంభమైంది. జె.శబరీష్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ చెన్నై, తంజావూరు, తిరుచ్చి, వారణాసి తదితర ప్రాంతాల్లో జరిగింది. 
 
ఢిల్లీ గణేష్‌, నిళల్‌గళ్‌ రవి, ఆర్‌.సుందరరాజన్‌, దేవదర్శిని, వినోదిని, వైద్యనాధన్‌, జీవా రవి, శ్రీరంజని తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా షూటింగ్ జనవరిలోనే పూర్తి కావడంతో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జులై నెలలో విడుదల చేయాలనుకున్నారు. 
 
అయితే లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా వాయిదా పడింది. జనవరిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్న సమయంలో చిత్ర ఆత్మహత్య చేసుకోవడం అందరినీ షాక్‌కు గురిచేసింది. ప్రస్తుతం ఆమె ఈ లోకంలో లేకపోయినా వీజే చిత్ర కాల్స్‌ సినిమా మంచి గుర్తింపు లభించే అవకాశం వుందని సినీ పండితులు సెలవిస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్... ఏంటది?

మీటింగ్ మధ్యలోనే వదిలేసి బైటకొచ్చి ఆఫీసు భవనం పైనుంచి దూకి టెక్కీ సూసైడ్

భర్తను సజీవదహనం చేసిన భార్య... ఎక్కడ?

18 సంవత్సరాలలో ఇదే మొదటిసారి- నాగార్జున సాగర్ జలాశయంలో గేట్ల ఎత్తివేత

సరస్వతీ పవర్ షేర్ల రద్దుకు అనుమతించిన ఎన్‌సీఎల్‌టీ- జగన్ పిటిషన్‌కు గ్రీన్ సిగ్నల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments