Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిఖిల్ స్పై చిత్రంలో సుభాష్ చంద్రబోస్ రహస్యాలు

Webdunia
శుక్రవారం, 12 మే 2023 (17:01 IST)
nikhil-spy
నిఖిల్ పాన్-ఇండియన్ మూవీ, నేషనల్ థ్రిల్లర్ ‘స్పై’ తుమ్ ముజే ఖూన్ దో, మై తుమ్హే ఆజాదీ దూంగా (మీరు నాకు రక్తం ఇవ్వండి నేను మీకు స్వేచ్ఛ ఇస్తాను) అని నినాదం ఇచ్చిన సుభాష్ చంద్రబోస్ యొక్క రహస్యాల ఆధారంగా రూపొందించబడిందని మేకర్స్ ఇటీవల విడుదల చేసిన వీడియో ద్వారా సూచించారు.
 
ఢిల్లీలో చారిత్రాత్మకం ఈవెంట్ చోటు చేసుకోనుంది. స్పై టీజర్ మే 15న కర్తవ్య పథ్(రాజ్ పాత్)లో విడుదల కానుంది. ఈ ఐకానిక్ ల్యాండ్‌ మార్క్‌ లో మూవీ  టీజర్ లాంచ్ కావడం ఇదే తొలిసారి. కౌంట్‌ డౌన్ ఇప్పుడు ప్రారంభమవుతున్నందున మీ క్యాలెండర్‌ లను మార్క్ చేసుకోండి. అందరి తో పంచుకోండి. అద్భుతమైన ఘట్టం ఒకటి తెరపైకి రాబోతోందని అందరికీ తెలియజేయండి.
 
ప్రముఖ ఎడిటర్ గ్యారీ బిహెచ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని ఈడీ  ఎంటర్‌ టైన్‌ మెంట్స్ పై కె రాజశేఖర్ రెడ్డి,  సి ఇ ఓ గా చరణ్ తేజ్ ఉప్పలపాటి నిర్మించారు.
 
నిఖిల్ సరసన ఐశ్వర్య మీనన్ కథానాయికగా నటిస్తుండగా, సన్యా ఠాకూర్ సెకండ్ ఫిమేల్ లీడ్ లో  పవర్‌ఫుల్ రోల్ పోషిస్తోంది. ఆర్యన్ రాజేష్ తన కమ్ బ్యాక్ లో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు.
 
ఈ చిత్రానికి నిర్మాత కె రాజశేఖర్ రెడ్డి కథను అందించారు. ఈ కంప్లీట్ యాక్షన్-ప్యాక్డ్ స్పై థ్రిల్లర్‌  తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది.
 
స్పై ఈ ఏడాది జూన్ 29న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments