Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్ స్టాపబుల్ చిత్రం రిలీజ్ డేట్ ప్రకటించిన మంత్రి మల్లారెడ్డి

Webdunia
శుక్రవారం, 12 మే 2023 (16:39 IST)
mallareddy and unstapable team
పిల్లా నువ్వు లేని జీవితం, ఈడోరకం, ఆడోరకం వంటి హాస్య ప్రధాన చిత్రాలతో రచయితగా తనదైన ముద్ర వేసుకున్న డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో రూపొందుతున్న హిలేరియస్ ఎంటర్ టైనర్ 'అన్ స్టాపబుల్'.  'అన్ లిమిటెడ్ ఫన్' అన్నది ఉపశీర్షిక.  బిగ్ బాస్ విన్నర్ విజె సన్నీ, సప్తగిరి హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో నక్షత్ర, అక్సాఖాన్ హీరోయిన్లు. ఎ2 బి ఇండియా ప్రొడక్షన్ లో రజిత్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 'అన్ స్టాపబుల్' టీజర్‌ , పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
 
తాజాగా అన్ స్టాపబుల్  థియేట్రికల్ రిలీజ్ డేట్ ఖరారైంది. మంత్రి మల్లారెడ్డి ఈ చిత్రం విడుదల తేదీని అనౌన్స్ చేశారు. జూన్ 9న  ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. సప్తగిరి, విజే సన్నీ తో పాటు సినిమా తారాగణం అంతా వున్న అనౌన్స్ మెంట్ పోస్టర్ ఈ చిత్రం  హిలేరియస్ ఎంటర్ టైనర్ అని భరోసా ఇస్తోంది.  
 
బ్లాక్ బస్టర్ ధమాకా కంపోజర్ భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. కో ప్రొడ్యూసర్లు షేక్ రఫీ, బిట్టు, రాము వురుగొండ వ్యవహరిస్తున్నారు.  డీవోపీ గా వేణు మురళీధర్, ఎడిటర్ గా ఉద్ధవ్ పని చేస్తున్నారు.  
 
తారాగణం: విజె సన్నీ, సప్తగిరి, నక్షత్ర, అక్సాఖాన్, బిత్తిరి సత్తి ,షకలక శంకర్, పృథ్వీ, డిజే టిల్లు మురళి, సూపర్ విమెన్ లిరీషా, రాజా రవీంద్ర, పోసాని కృష్ణ మురళి, చమ్మక్ చంద్ర, విరాజ్ ముత్తంశెట్టి, గీతా సింగ్, రోహిణి, రూప లక్ష్మీ, మణి చందన, విక్రమ్ ఆదిత్య, రఘుబాబు, ఆనంద్ చక్రపాణి, గబ్బర్ సింగ్ బ్యాచ్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం కేసీఆర్

సెకీతో సౌర విద్యుత్ ఒప్పందంలో ఎలాంటి సంబంధం లేదు : బాలినేని

అనకాపల్లిలో గ్రీన్ హైడ్రోజన్ హబ్‌కు శంకుస్థాపన చేయనున్న ప్రధాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments