Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరవింద సమేత 'పెనిమిటి' పాట విని థమన్ తల్లి కన్నీరుమున్నీరు...

రోజురోజుకీ అంచనాలు పెరిగిపోతున్న ఎన్‌టిఆర్ తాజా చిత్రం 'అరవింద సమేత వీరరాఘవ' నుంచి "పెనిమిటి" పాట విడుదలైంది. ఈ పాటలో ఇంటికి దూరమైన భర్త కోసం ఇల్లాలు పడే వేదనను కళ్లకు కట్టినట్లు చూపారు.

Webdunia
శుక్రవారం, 21 సెప్టెంబరు 2018 (10:57 IST)
రోజురోజుకీ అంచనాలు పెరిగిపోతున్న ఎన్‌టిఆర్ తాజా చిత్రం 'అరవింద సమేత వీరరాఘవ' నుంచి "పెనిమిటి" పాట విడుదలైంది. ఈ పాటలో ఇంటికి దూరమైన భర్త కోసం ఇల్లాలు పడే వేదనను కళ్లకు కట్టినట్లు చూపారు. రామజోగయ్య శాస్త్రి అద్భుతమైన సాహిత్యం అందించగా, ఎస్.ఎస్.థమన్ ఇచ్చిన ట్యూన్ దానికి అతికినట్లు సరిపోయింది. దీనికితోడు గాయకుడు కాల భైరవ తన గాత్రంతో పాటకు జీవం పోసారు. అన్నీ కలిపి పాట చాలా అద్భుతంగా వచ్చింది.
 
రామజోగయ్య శాస్త్రి చాలా కాలం తర్వాత చక్కటి ప్రాసతో అద్భుతమైన పదాలను ఉపయోగించి పాటకు ఒక మంచి రూపాన్ని అందించారు. పాట విన్న ప్రతి ఒక్కరూ గుండెలు పిండేసేలా ఉందని, ఇది అద్భుతమైన పాట అని మంచి కితాబు ఇవ్వడం విశేషం. సంగీత దర్శకుడు థమన్ తల్లి కూడా ఈ పాట విని కన్నీరు పెట్టుకుందని, ఆమె కన్నీళ్లతో తన షర్టు తడిచిపోయినట్లు ఆయన తెలిపారు.
 
రామజోగయ్య శాస్త్రి ఈ పాట కొన్ని తరాల పాటు నిలిచిపోతుందని, ఈ పాట రాసేందుకు తగిన సందర్భాన్ని ఇచ్చినందుకు త్రివిక్రమ్‌కు తాను రుణపడి ఉంటానని తెలిపారు. అయితే అదే స్థాయిలో ఈ పాటకు యూట్యూబ్‌లో ఒక్క రోజులోనే 3 లక్షల మిలియన్ వ్యూస్ వచ్చాయి. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments