Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ సినిమా పూర్తయ్యాకే 'బాహుబలి' పెళ్లి

టాలీవుడ్‌లో ముదురు బ్యాచిలర్‌గా పేరుగాంచిన హీరో ప్రభాస్ పెళ్లి ఎపుడెపుడా అంటూ ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఫిల్మ్ నగర్‌లో అయితే, ఇదే అంశంపై పదేపదే చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ పెళ్

Webdunia
శుక్రవారం, 21 సెప్టెంబరు 2018 (10:24 IST)
టాలీవుడ్‌లో ముదురు బ్యాచిలర్‌గా పేరుగాంచిన హీరో ప్రభాస్ పెళ్లి ఎపుడెపుడా అంటూ ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఫిల్మ్ నగర్‌లో అయితే, ఇదే అంశంపై పదేపదే చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ పెళ్లి విషయంపై ఓ క్లారిటీ వార్త వినిపిస్తోంది.
 
ప్రస్తుతం 'సాహో' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న ప్రభాస్.. ఆ సినిమా పూర్తయ్యాక పెళ్లి విషయంలో క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు. వాస్తవానికి 'బాహుబలి' తర్వాత అంతా ప్రభాస్ పెళ్లి గురించి మాట్లాడుకున్నారు. అయితే 'బాహుబలి' ప్రాజెక్టు తర్వాత మరో ఐదేళ్ల సమయాన్ని రాజమౌళి కోసం ఇచ్చానని గతంలో ప్రభాస్ డిక్లేర్ చేశారు. 
 
మీడియా కూడా ఆయన పెళ్లి వార్తలకు అధిక ప్రాధాన్యతనిచ్చింది. ఆయన చిన్నాన్న కృష్ణంరాజు కూడా ప్రభాస్ పెళ్లి విషయంలో ఆసక్తిగానే ఉన్నారు. తాజాగా 'సాహో' పూర్తయిన వెంటనే ప్రభాస్ పెళ్లి పీటలెక్కడం ఖాయమని కృష్ణంరాజు ఇటీవల చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఎప్పుడనేది ఖచ్చితంగా చెప్పలేకున్నా కృష్ణంరాజు మాటల్ని బట్టి 'సాహో' పూర్తయ్యాక త్వరలోనే ఉండే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vijay as Pawan: పవన్‌లా వుండిపో.. పీకే సూచన.. పళని సీఎం అయితే విజయ్‌ డిప్యూటీ సీఎం?

బైకుకు ముందొకరు, వెనుకొకరు.. మందేసి బైకుపై నిల్చుని.. ఫ్లయింగ్ కిస్‌లు ఇస్తూ యువతి హంగామా.. (video)

Trump-Zelenskyy: డొనాల్డ్‌ ట్రంప్‌, జెలెన్‌స్కీల మధ్య వాగ్వాదం.. తలపట్టుకున్న ఒక్సానా.. వీడియో వైరల్

ప్రియుడుతో కలిసి భర్తపై భార్య హత్య యత్నం: ప్రాణాల కోసం పోరాడిన భర్త మృతి

హలో... మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది: అత్తామామలకు అల్లుడు ఫోన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments