Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీరెడ్డి యూట్యూబ్ ఛానెల్ మొదలెట్టేసింది.. స్నేక్ బాబుపై కామెంట్స్

Webdunia
శుక్రవారం, 8 మార్చి 2019 (12:49 IST)
నిన్నటి వరకు ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో రచ్చ రచ్చ చేసిన శ్రీరెడ్డి కొత్తగా యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసింది. ఇక ఇందులో పెట్టిన మొదటి వీడియోలోనే భారీగా ఉంటుందని అనుకుందో ఏమో మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసింది. నాగబాబుపై విరుచుకుపడుతూ తనదైన వ్యంగ్యపు శైలిలో కామెంట్స్ చేసింది. ఇదంతా చూస్తుంటే నాగబాబు ఓపెన్ చేసిన ‘అంతా నా ఇష్టం’ యూట్యూబ్ ఛానల్‌కి పోటీగా ‘నా ఛానల్ నా ఇష్టం’ అంటూ ఈ ఛానెల్‌ను ప్రారంభించినట్లు తెలుస్తోంది.
 
మూడున్నర నిమిషాలు ఉన్న ఈ వీడియోలో, "ఏవండీ స్నేక్ బాబు గారు, మీకు మాత్రమే వచ్చా ఛానల్ పెట్టుకోవడం, మాకు కూడా వచ్చు, మీరు ఎలాగైతే పెట్టారో మేము కూడా అలాగే పెట్టాము, ముందుగా మీకు థాంక్యూ, నాకు ఈ ఆలోచన వచ్చేలా చేసినందుకు, ఇక మీకు కౌంటర్లు స్టార్ట్ అవుతాయి’ అంటూ యుద్ధం మొదలెట్టింది. టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని విషయంలో మీరెలా ప్రవర్తిస్తున్నారో మీకు అర్థం అవుతోందా? ఇంత వయసు వచ్చినా సిగ్గు, జ్ఞానం, బుద్ధి రాలేదంటే మీ మీద జాలిగా ఉంది. 
 
యామినిని ఇంత దారుణంగా ట్రోల్ చేస్తున్నారు మీ గొర్రెల మంద. ఈ పరిస్థితిలో మీ అమ్మాయి ఉంటే, ఇలాగే చేస్తావా? అంటూ నిలదీశారు. నీకు అసలు ఐడెండిటీ లేదు. చిరంజీవి తమ్ముడు, పవన్ అన్నయ్య అని మాత్రమే నీకు గుర్తింపు ఉంది. ఛానెల్ పెట్టి నీ పరువు మొత్తం తీసుకున్నావు. నీ తల్లిని అన్నప్పుడు ఎంత రచ్చ చేసావు, అలాంటిది ఇంకో ఆడకూతురికి ఇలా జరుగుతుంటే మందలించాల్సింది పోయి ఇలా చేస్తావా.. ఎంతో మంది వెధవలు ఉన్నారు, నువ్వు కూడా వారిలో ఒకరిగా మారతావని అనుకోలేదు. ఎంత తిట్టినా మారవు కాబట్టి వదిలేస్తున్నా’ అంటూ శ్రీరెడ్డి విరుచుకుపడ్డారు శ్రీరెడ్డి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments