Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దిలీప్ సుంకర.. నా కొ.. ఈ మధ్య తెగ బలిసిపోతున్నావ్.. పూనకం వచ్చినట్లు ఊగిపోయే పవన్‌కు?

Advertiesment
దిలీప్ సుంకర.. నా కొ.. ఈ మధ్య తెగ బలిసిపోతున్నావ్.. పూనకం వచ్చినట్లు ఊగిపోయే పవన్‌కు?
, మంగళవారం, 5 మార్చి 2019 (12:28 IST)
ఆంధ్రప్రదే‌లో టీడీపీ తరపు నుంచి ఫైర్‌బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న సాధినేని యామిని సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుండే ఈమె ప్రస్తుతం నెటిజన్ల నోళ్లల్లో నానుతోంది. గత కొంత కాలంగా సోషల్ మీడియాలో సాదినేని యామిని కి సంబంధించి వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా టీడీపీ అధికార ప్రతినిధి సాదినేని యామినిపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 
ఆ మధ్య ఓ టీవీ షోలో జనసేన నేత దిలీప్ సుంకర, యామినిల మధ్య మాటల యుద్ధం హద్దులు దాటడంతో ఆమె కన్నీరు పెట్టుకుంటూ షో నుంచి వాకౌట్ చేశారు. అతనిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని కూడా యామిని అప్పట్లో చెప్పారు. ప్రస్తుతం సాధినేని యామినికి వివాదాస్పద నటి శ్రీరెడ్డి మద్దతు తెలిపింది. జనసేన పార్టీలో దిలీప్ సుంకర ఎక్కడుంటాడో తెలియదని.. ఎక్కడా కండువా కప్పుకుని కనిపించడని.. కుర్చీలో పట్టనంతగా బలిసిపోయి.. మహిళలపై ఇలా విజృంభించి కామెంట్స్ చేస్తాడా... అంటూ తీవ్రపదజాలంలో దూషణకు దిగింది. 
 
ఇందుకు దిలీప్ సుంకర కూడా శ్రీరెడ్డిని ఏకిపారేశాడు. అయినా శ్రీరెడ్డి దిలీప్ సుంకరపై బూతుల వర్షం కురిపించింది. ఓ మహిళను టీవీ చర్చా కార్యక్రమంలో అలా మాట్లాడేందుకు దిలీప్ సుంకర ఎలా నోరొచ్చిందని.. జనసేన పార్టీలో వుంటున్న దిలీప్ సుంకర రౌడీలా వ్యవహరిస్తున్నాడని ధ్వజమెత్తింది. ఒళ్లు బలిసిపోయిందా అని యామినిని అడగడానికి ఎంత ధైర్యం, ఎన్ని గుండెలున్నాయ్ రా అంటూ తీవ్రస్థాయిలో మండిపడింది. మల్లెపువ్వులు మహిళలకు ఇష్టం కాబట్టే వాటిని కోరుకుంటామని కూల్‌గా యామిని అంటే సమస్యలంటే మల్లెపూలు మంచం కోళ్లు కాదు అంటావా 
 
ఇలాంటి ఎంతో మంది జనసేనలో వున్నారని.. జనసేనాని.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఏదో పూనకం వచ్చినట్సు తెగ ఊగేసి మాట్లాడేస్తుంటాడని.. ఆయన ఏం మాట్లాడుతున్నారో అసలేం అర్థం కాదు.. అలా మాట్లాడితే ఓటేస్తారనుకుంటున్నారు.. ఒక్కరూ ఓటేసి గెలిపించరు. అంతేకాదు.. అలా ఓటేస్తే.. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే.. ఇక మహిళలకు భద్రత వుండదని.. మహిళలకు గౌరవం ఇవ్వని జనసేన పార్టీని ఎన్నికల్లో గెలిపించవద్దని శ్రీరెడ్డి ఫైర్ అయ్యింది. ప్రస్తుతం శ్రీరెడ్డి, దిలీప్ సుంకరల పంచ్‌లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తప్పు చేయకపోతే.. ఉలికిపాటు ఎందుకు చంద్రమా? కేటీఆర్ సూటి ప్రశ్న