Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌కి ఫుల్ సపోర్ట్.. గోరింటాకుతో జగన్ పేరు.. రోజాలా ఫైర్ బ్రాండ్ అవుతుందా?

Webdunia
ఆదివారం, 12 మే 2019 (10:52 IST)
టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ సమస్యపై గళమెత్తిన శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఆమె వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ పోస్టు పెట్టింది. ఈ పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ఈ మధ్య జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుపై కూడా ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యింది ఈ బ్యూటీ. తాజాగా ఆమె వైసీపీలోకి ఎంట్రీ ఇస్తుందన్న వార్తొకటి హల్ చల్ చేస్తోంది. ఆల్రెడీ నటి, ఎమ్మెల్యే, జబర్దస్త్ జడ్జిగా వ్యవహరిస్తున్న రోజా... వైసీపీలో ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం శ్రీరెడ్డి కూడా ఆ పార్టీలో చేరితే ఆ పార్టీకి మరో ఫైర్ బ్రాండ్ అవుతుందని టాక్ వస్తోంది.  
 
ఇందులో భాగంగా  జగన్మోహన్ రెడ్డికి శ్రీరెడ్డి ఫుల్ సపోర్ట్ ఇచ్చింది. అందుకు సాక్ష్యంగా... తన చేతిపై జగన్ అనే పేరును గోరింటాకుతో వేయించుకుంది. తద్వారా వైసీపీలోకి త్వరలో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు పరోక్ష సంకేతాలు ఇచ్చిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఇప్పటికే ఫేస్‌బుక్‌లో 60 లక్షల మందికి పైగా ఫాలోయర్లను సంపాదించుకున్న శ్రీ రెడ్డి రాజకీయాల్లోకి వెళ్తే కచ్చితంగా సెన్సేషనే అవుతుందని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అత్తమ్మ కిచెన్ ఆవకాయ అదుర్స్ : ఉపాసన (Video)

Mega DSC: 16,347 పోస్టులలో స్పోర్ట్స్ కోటా కింద 421 పోస్టులు

వైకాపాకు జగన్ అధ్యక్షుడు కాదు.. రాబందుల పార్టీకి చీఫ్ : మంత్రి నిమ్మల

అనారోగ్యంతో మరణించిన బాలిక... టెన్త్ ఫలితాల్లో స్కూల్ టాపర్

రోడ్డుపై నడుస్తూ వెళ్లిన ముస్లిం మహిళను ఢీకొన్న కారు.. ఆ బాలుడు ఏం చేశాడంటే? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

తర్వాతి కథనం
Show comments