నాగశౌర్య సరసన మెహ్రీన్

శుక్రవారం, 10 మే 2019 (14:57 IST)
తెలుగు చిత్ర సీమలో రాణిస్తున్న కుర్రకారు హీరోయిన్లలో మెహ్రీన్ ఒకరు. ఈమె గ్లామరస్ పాత్రలతో యూత్ హృదయాలను కొల్లగొడుతోంది. అయితే, ఈ అమ్మడు నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. ఈ క్రమంలో "ఎఫ్-2" చిత్రంలో ఆమె మెగా హీరో వరుణ్ తేజ్‌కి జోడీగా నటించి మంచి మార్కులు కొట్టేసింది. 
 
ఈ సినిమా తర్వాత ఆమె చాలా బిజీ అవుతుందని అంతా భావించారు. కానీ మెహ్రీన్ మాత్రం తనకి నచ్చిన పాత్రలను మాత్రమే ఓకే చేస్తూ వెళుతోంది. 'తిరు' దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా రూపొందుతోన్న సినిమాలో నటిస్తోంది. 
 
తాజాగా మరో సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. నాగశౌర్య హీరోగా ఆయన సొంత బ్యానర్‌లోనే ఒక సినిమా నిర్మితంకానుంది. ఈ సినిమాలో కథానాయికగా మెహ్రీన్‌ను ఎంపిక చేసుకున్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ద్వారా కొత్త దర్శకుడు పరిచయంకానున్నాడు. ప్రస్తుతం అవసరాల దర్శకత్వంలో ఒక సినిమా చేస్తోన్న నాగశౌర్య, అది పూర్తికాగానే కొత్త ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నాడు

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం #SitaTrailer.. నా పేరు సీత నేను గీసిందే గీత.. ప్రాస బాగుంది కదా (వీడియో)