యువ హీరో నాగ శౌర్య ప్రస్తుతం అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి అనే సినిమా చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. త్వరలో ఈ సినిమా రిలీజ్‌కి రెడీ అవుతోంది. నాగశౌర్య ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పై వచ్చిన రూమర్స్ గురించి క్లారిటీ ఇచ్చాడు.
రూమర్స్ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా... నా మొదటి సినిమా అప్పటి నుండి చాలా రకాల రూమర్స్ వస్తూనే ఉన్నాయి. అయితే నా వరకూ వచ్చినవి రెండే రెండు. అందులో ఒకటి శౌర్యకి పెళ్లైపోయింది. 2016లో నాగశౌర్యకి పెళ్లైపోయింది.. అందుకే రెండేళ్లు సినిమాలు చేయలేదని వార్త వచ్చింది. రెండోది రాశీఖన్నాతో మూడేళ్లుగా ఎఫైర్ ఉందన్నారు.
ఇక నిహారికతో లవ్‌లో ఉన్నానని.. పెళ్లికి వాళ్ల పేరెంట్స్ కూడా అంగీకరించారని వార్తలు రాశారు.
మీ ఇష్టం వచ్చినట్టు రాసేస్తారా? పెళ్లైపోయిందని ఒకరు.. పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాడని ఇంకొకరు.. ఎఫైర్ ఉందని మరొకరు ఇలా రాసుకుంటూ పోతుంటే మా పరిస్థితి ఏంటి? నా పెళ్లి అయితే నేను చెప్తాను కదా.. అందర్నీ పిలిచి మరీ చెప్తానని.. ఇప్పటివరకు వచ్చినవి అన్నీ రూమర్స్ అని చెప్పాడు.