Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ అబ్బాయితో డేటింగ్‌కు సిద్ధమంటున్న మెగా డాటర్

Advertiesment
Niharika
, మంగళవారం, 19 మార్చి 2019 (11:37 IST)
మెగా డాటర్ నిహారిక కొణిదెల, రాహుల్ విజయ్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా 'సూర్యకాంతం' మార్చి 29న విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్‌కు మంచి ఆదరణ లభించింది. ఇక తాజాగా '60 సెకండ్స్ విత్ సూర్యకాంతం' అంటూ ఒక ప్రమోషనల్ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో నిహారిక తన వ్యక్తిగత అభిరుచులు, ఇష్టాల గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.
 
వరస్ట్ యాష్ ట్యాగ్ ఏంటి అని అడగగా ‘‘వన్ లైఫ్ వన్ లవ్'' అనేది చెత్త యాష్ ట్యాగ్ అని జవాబిచ్చారు. మీరు స్నానం చేయకుండా 2 రోజులు ఉంటారా? అనే ప్రశ్నకు ‘అవును' అని చెప్పారు. మరో ప్రశ్నకు నేను చాలా సెల్ఫిష్ అని కూడా చెప్పారు. ఎలాంటి అబ్బాయితో మీరు డేటింగ్ చేయడానికి ఇష్టపడతారు? అనే ప్రశ్నకు ‘‘నేను బాగా మాట్లాడతాను. కాబట్టి నేను చెప్పే విషయాలను ఆసక్తిగా వినే అబ్బాయితో డేటింగ్ చేయడానికి ఇష్టపడతాను' అని సమాధానం చెప్పారు. 
 
ఫసక్ అనే పదం గురించి మీరేమనుకుంటున్నారు? అని అడగ్గా... ‘ఈ పదం ఎలాంటి ఎమోషన్‌కైనా సరిపోతుంది. కోపం, బాధ, సంతోషం అన్నింటికీ దీన్ని వాడొచ్చు అని చెప్పారు. మీరు డ్రీమ్ క్యారెక్టర్ ఏమిటి? అనే ప్రశ్నకు... ‘యే జవానీ హై దివానీ' సినిమాలో నైనా పాత్ర చేయాలని ఉందంటూ మనసులో మాట చెప్పారు. ‘సూర్యకాంతం' సినిమాలో ఇంటర్వెల్ సీన్ నా ఫేవరెట్ అని తెలిపారు. ‘సూర్యకాంతం' సినిమాను నిర్వాణ సినిమాస్ నిర్మిస్తుండగా, వరుణ్ తేజ్ సమర్పణలో ఈ నెల 29న విడుదల కానుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అర్థనగ్నంగా హోళీ శుభాకాంక్షలు చెప్పిన హీరోయిన్