Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 18 April 2025
webdunia

పెళ్లి పీటలెక్కనున్న మెగా డాటర్... సాయి ధరమ్ తేజ్ కేవలం

Advertiesment
Nagababu
, సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (17:10 IST)
మెగా బ్రదర్ నాగబాబు ప్రస్తుతం సోషల్ మీడియా సంచలనంగా మారారు. పలు విషయాల గురించి సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఛానెల్ వారు చేసిన ఇంటర్వ్యూలో ఆయన నిహారిక, వరుణ్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
 
ఇక నిహారిక పెళ్లి విషయం అడగగా, ఆల్రెడీ పెళ్లి ప్రయత్నాలు జరుగుతున్నట్లు చెప్పారు, నిహారికకు నటనపై ఆసక్తి ఉంది, అందుకే సినిమాలలోకి వస్తాను అనగానే ఓకే చెప్పాను. కానీ అప్పుడే తాము మూడేళ్లలో పెళ్లి చేస్తామని, అప్పటి దాకా ఈ విషయంలో మేము ఎలాంటి ఒత్తిడి తీసుకురామని చెప్పాము. అనుకున్నట్లుగానే 2018తో మూడేళ్లు పూర్తయ్యాయి. అప్పటి నుండి పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టాము. 
 
అబ్బాయి కులం గురించి పెద్దగా పట్టింపు లేదు, కాపు కులంపై గౌరవం ఉంది, అయితే కాపు కులం కాకపోయినా మంచి అబ్బాయి, కుటుంబం అయితే అభ్యంతరం తెలపను. అయితే అబ్బాయి నిహారికకు నచ్చడం ముఖ్యం. ఇక నిహారిక, సాయి ధరమ్ తేజ్‌లపై వచ్చిన పెళ్లి వార్తల గురించి ప్రస్తావించగా, వారు వరుసకు బావామరదళ్లు అయినప్పటికీ వాళ్ల మనస్సులో అలాంటి భావన లేనట్లు తేల్చి చెప్పారు నాగబాబు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జబర్దస్త్ నరేష్‌పై దాడి... ఆ పనే కారణమా?