Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 16 April 2025
webdunia

బండ్ల గ‌ణేష్ బ్లేడ్ కామెంట్స్... నాగ‌బాబు ఏమ‌న్నారో తెలుసా..?

Advertiesment
Nagababu comments
, సోమవారం, 31 డిశెంబరు 2018 (16:26 IST)
తెలంగాణ ఎన్నికల్లో ప్రజా కూటమి గెలుపు ఖాయమని, ఓడిపోతే బ్లేడుతో గొంతు కోసుకుంటానని టీపీసీసీ అధికార ప్రతినిధి బండ్ల గణేశ్ వ్యాఖ్య‌లు చేయ‌డం... అవి ఎంతటి దుమారాన్ని రేపాయో అందరికీ తెలిసిందే. ఎన్నిక‌ల ఫ‌లితాలు రావ‌డం.. కూట‌మి ఓడిపోవ‌డం కూడా జ‌రిగింది. గ‌ణేష్ బ్లేడుతో గొంతు కోసుకోనూలేదు కానీ ఇప్పటికీ బ్లేడ్ ట్రెండ్ అవుతూనే ఉంది. తాజాగా మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు బండ్ల గణేశ్ వ్యాఖ్యలపై ఓ న్యూస్ ఛాన‌ల్‌కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో స్పందించారు. 
 
ఇంత‌కీ ఏమ‌న్నారంటే... బండ్ల గణేశ్ ఎక్కువగా మాట్లాడాడు. తప్పులేదు.. అతని పార్టీపై ఉన్న నమ్మకంతో అలా మాట్లాడాడు. గణేశ్ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? ఎంత నమ్మకముంది ఇతనికి? అనుకున్నాను. ఇది మేకపోతు గాంభీర్యమే అని నాకు అనిపించింది. కానీ, నేను వన్ పర్సంట్ కూడా డౌట్ పడలేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజారిటీ మాత్రం కేసీఆర్‌కే వస్తుంది అని భావించాను. నేను, మా పిల్లలు అంతా టీఆర్ఎస్‌కే ఓటు వేశాం అని నాగబాబు చెప్పారు. 
 
గణేశ్ ఇంటర్వ్యూలు చూడటానికి చాలా బాగుంటాయని.. చాలా ఫన్ జనరేట్ చేస్తాడు. నిజంగా ఈ ఫన్ సినిమాలో చేసి ఉండుంటే చాలా పెద్ద కమెడియన్ అయ్యేవాడు. కానీ సినిమాలో చూపించకుండా రియల్ లైఫ్‌లో చూపిస్తున్నాడు కామెడీ. ఏదో చెయ్యాలనే తపన అయితే మాత్రం గణేశ్‌లో ఉంది. కాంగ్రెస్‌లో చేరి ఎమ్మెల్యేగా, ఎంపీగా అవ్వాలని కోరుకుంటున్నాడు అని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్లీవేజ్, లిప్ లాక్‌కు ఓకే.. జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్