టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న అందాల ముద్దుగుమ్మ శ్రియ. యంగ్ హీరోయిన్లు వచ్చినా తనకంటూ ఓ స్థానాన్ని నిలబెట్టుకున్న శ్రియ.. పెళ్లికి తర్వాత కూడా సినిమాల్లో కనిపిస్తోంది.
తాజాగా 'వీర భోగ వసంత రాయలు' అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలో శ్రియతో పాటు నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రీవిష్ణులు నటిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇంకా త్వరలో విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్‌లో సినీ యూనిట్ బిజీ బిజీగా వుంది.
ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా శ్రియ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'వీర భోగ వసంత రాయలు' చిత్రంలో వైవిధ్యభరితమైన పాత్రను పోషించానని చెప్పింది. సిగరెట్ తాగడం, మందు కొట్టే సన్నివేశాల్లో నటించడం తనకు చాలా ఇబ్బంది అనిపించిందని తెలిపింది. సిగరెట్ తాగే విషయంలో మరింత ఇబ్బంది పడ్డానని శ్రియ చెప్పుకొచ్చింది.
ఒక గదిలో ఈ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండటంతో గదంతా పొగతో నిండిపోయిందని శ్రియ వెల్లడించిది. ఆ పొగతో గదిలో ఉన్నవారమంతా ఇబ్బంది పడ్డామని చెప్పింది. ఒక గదిలో అలాంటి సీన్ చేయడం మామూలు విషయం కాదని శ్రియ తెలిపింది. ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందని శ్రియ చెప్పుకొచ్చింది.