Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వీర భోగ వసంతరాయలు... ఈ పాట ప్రణయ్‌కి అంకితం..

వీర భోగ వసంతరాయలు సినిమా నుంచి తొలిసాంగ్ విడుదల కాబోతోంది. ఈ పాటను ప్రత్యేకంగా ప్రేమ కోసం బలైన వాళ్లకి అంకితంగా ఇస్తున్నామని సినీ యూనిట్ వెల్లడించింది. సెప్టెంబర్ 21న విడుదల కాబోతున్న ఈ పాటను మిర్యాలగ

వీర భోగ వసంతరాయలు... ఈ పాట ప్రణయ్‌కి అంకితం..
, మంగళవారం, 18 సెప్టెంబరు 2018 (13:31 IST)
వీర భోగ వసంతరాయలు సినిమా నుంచి తొలిసాంగ్ విడుదల కాబోతోంది. ఈ పాటను ప్రత్యేకంగా ప్రేమ కోసం బలైన వాళ్లకి అంకితంగా ఇస్తున్నామని సినీ యూనిట్ వెల్లడించింది. సెప్టెంబర్ 21న విడుదల కాబోతున్న ఈ పాటను మిర్యాలగూడ ఉదంతంలో ప్రాణాలు కోల్పోయిన ప్రణయ్‌కి అంకితం ఇచ్చారు.


నారా రోహిత్‌, శ్రీవిష్ణు, సుధీర్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ ''వీర భోగ వసంత రాయలు'' సినిమాకు ఇంద్రసేన దర్శకుడు. ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ శ్రియ కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం. కాగా వైవిధ్యంమైన కథ కథనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఎవరు ఊహించని విధంగా డిఫరెంట్‌గా ఉంటుందట. 
 
ఈ ప్రయోగాత్మకమైన చిత్రం తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తోందని తెలుస్తోంది. క్రైమ్ డ్రామా థ్రిల్లర్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాబిన్ సంగీతం సమకూరుస్తుండగా, బాబా క్రియేష‌న్స్ ప‌తాకంపై, ఎంవికె రెడ్డి గారి సమర్పణలో అప్పారావు బెల్లాన నిర్మిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'అరవింద్ సమేత వీర రాఘవ'లో 'పెనివిటి' సాంగ్ రిలీజ్ ఎపుడంటే...