Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పెళ్లి చేసుకుంటేనే గుండె భద్రం.. సహజీవనం చేసినా పర్లేదు.. సింగిల్‌గా మాత్రం?

పెళ్లి అనే పదాన్ని భవిష్యత్తు తరం మరిచిపోయినా ఆశ్చర్చపడనక్కర్లేదు. సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ల పుణ్యంతో మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. ఫేస్‌బుక్‌లో ప్రేమ.. స్కైప్‌లో నిశ్చితార్థాలు జరిగిపోతున్న ఈ

పెళ్లి చేసుకుంటేనే గుండె భద్రం.. సహజీవనం చేసినా పర్లేదు.. సింగిల్‌గా మాత్రం?
, బుధవారం, 20 జూన్ 2018 (15:16 IST)
పెళ్లి అనే పదాన్ని భవిష్యత్తు తరం మరిచిపోయినా ఆశ్చర్చపడనక్కర్లేదు. సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ల పుణ్యంతో మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. ఫేస్‌బుక్‌లో ప్రేమ.. స్కైప్‌లో నిశ్చితార్థాలు జరిగిపోతున్న ఈ కాలంలో పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేసే జంటల సంఖ్య పెరిగిపోతున్నాయి. అందుకే ప్రస్తుత యువత పెళ్లికి ఆమడ దూరంలో నిలిచిపోతుంది. 
 
పెళ్లంటే భయపడిపోతున్నారు. తొందరపడొద్దు బ్రదర్ అంటూ ఫ్రెండ్స్ సలహాలు, సూచనలు ఇస్తుండటంతో.. యువత పెళ్లిపై పెద్దగా ఆసక్తి చూపట్లేదు. అయితే తాజా అధ్యయనంలో తేలిందేమిటంటే..? పెళ్లి చేసుకుంటేనే గుండెకు మంచిదట. లేటు వయసులో ఓ తోడు ఉంటే గుండె జబ్బులు, గుండె పోటు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని పరిశోధకులు తేల్చారు. 
 
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో పెళ్లి చేసుకోవడం ద్వారా హృద్రోగాలను దూరం చేసుకోవచ్చునని తేలింది. యూరప్, ఉత్తర అమెరికా, మిడిల్ ఈస్ట్, ఆసియాల్లోని అన్ని వర్గాలకు చెందిన 42 నుంచి 70 ఏళ్ల వయసున్న వారిపై ఈ అధ్యయనం జరిగిందని పరిశోధకులు వెల్లడించారు. పెళ్లి చేసుకున్న వారితో పోలిస్తే పెళ్లి చేసుకోని వారు, విడాకులైనవారు, భర్త లేదా భార్య చనిపోయిన వారిలో గుండె జబ్బుల ముప్పు 42 శాతం వుందని పరిశోధనలో తేలింది. 
 
అలాగే గుండె రక్తనాళాలు బ్లాక్ అయ్యే ముప్పు 16శాతం అధికంగా వున్నట్లు తేల్చారు. అయితే పెళ్లికాని వారు గుండెపోటుతో చనిపోయే ముప్పు 55 శాతం, రక్తనాళాలు బ్లాక్ అయ్యి గుండె జబ్బు వచ్చి చనిపోయే ముప్పు 42 శాతం అధికంగా వుందని పరిశోధకులు తెలిపారు. ఇక, అత్యధికంగా ఈ ముప్పు మగవారిలోనేనని పరిశోధకులు తేల్చారు. 
 
పెళ్లి అయినా కాకపోయినా సహజీవనం చేసినా గుండె జబ్బు ముప్పులు చాలా వరకు తగ్గుతాయని బ్రిటన్‌లోని స్టోక్ ఆన్ ట్రెంట్‌లో గల రాయల్ స్టోక్ ఆస్పత్రి గుండె జబ్బుల విభాగం నిర్వహించిన అధ్యయనంలో తేలింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాస్తా తయారీ విధానం...