Webdunia - Bharat's app for daily news and videos

Install App

సునీతకు కరోనా పాజిటివ్.. అవన్నీ అసత్యాలు.. కేటీఆర్‌కు ఫిర్యాదు (video)

Webdunia
సోమవారం, 23 మార్చి 2020 (10:15 IST)
ప్రముఖ సింగర్ సునీతకు కరోనా పాజిటివ్ అని సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై ఆమే స్వయంగా స్పందించారు. తనపై అసత్య కథనాలు వెల్లడించడంపై సునీత ఫైర్ అయ్యారు. కొన్ని వెబ్‌సైట్లలో వచ్చిన కథనాలు తనకు తీవ్ర మనస్తాపం కలిగించాయని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది.
 
కరోనా వ్యాధి విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో సింగర్ సునీతకు కరోనా వ్యాధి సోకిందంటూ వార్తలు వచ్చాయి. సునీత ఫోటోను బ్లర్ చేసి అసత్య కథనాన్ని ప్రచురించారు. ఈ విషయం సింగర్ సునీత దృష్టికి రావడంతో తీవ్రంగా స్పందించారు.

తన ప్రతిష్టకు భంగం కలిగే విధంగా వ్యవహరించిన సోషల్ మీడియా అకౌంట్‌పై చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్‌లో ఫిర్యాదు చేశారు. తన ఆరోగ్యం బాగానే వుందని.. తనకు ఎలాంటి వ్యాధి సోకలేదని కేటీఆర్‌కు సునీత ఆ వార్తను ట్యాగ్ చేస్తూ తనకు న్యాయం చేయాలని కోరారు.
 
చందమామ కథలు ఫేస్‌బుక్ పేజ్ నా ఫోటోను థంబ్ నైల్‌గా పెట్టి ఓ వార్తను పోస్టు చేశారు. వాస్తవానికి ఆ వార్తకు నాకు ఎలాంటి సంబంధం లేదు. సింగర్ కనికాకు కరోనా వార్త అయితే నా ఫోటోను పెట్టారు. ఇది చాలా దారుణం. ఇలా మరొకరికి జరుగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ట్విట్టర్‌లో స్పందించారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుటుంబ వివాదాలు.. భర్తను హత్య చేసి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన భార్య!

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి అదే కారణమా?

భర్త అక్రమ సంబంధం.. దంత మహిళా వైద్యురాలు ఆత్మహత్య ... ఎక్కడ?

పేర్ని నానీ నీకంత కొవ్వు పట్టిందా? వల్లభేని వంశీని గుర్తు చేసుకో : సోమిరెడ్డి

సమోసా జిలేబీలపై చక్కెర, నూనె ఎంతుందో హెచ్చరించాలి.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments