Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనా బాధితులకు రుణాలు.. ఎస్‌బీఐ

Advertiesment
కరోనా బాధితులకు రుణాలు.. ఎస్‌బీఐ
, సోమవారం, 23 మార్చి 2020 (09:34 IST)
కరోనా బాధితులకు చికిత్స కోసం రుణాలను ఇచ్చేందుకు ఎస్‌బీఐ స్పష్టం చేసింది. కరోనా కారణంగా చికిత్స పొందేవారికి అవసరమయ్యే మొత్తాన్ని రుణాలుగా ఇచ్చేందుకు సిద్ధమని ఎస్‌బీఐ ప్రకటించింది. ప్రత్యేక కేటాయింపు కింద ఈ మొత్తాన్ని రుణంగా ఇవ్వనున్నట్లు ఎస్‌బీఐ ప్రకటించింది. కరోనా ఎమెర్జెన్సీ స్కీమ్ కింద జూన్ 30 తేదీ వరకు అమలులో వుంటుంది. 
 
ఎస్‌బీఐ కస్టమర్లు కరోనా బాధితులైతే వారికి రుణాలు అఫ్పగించేందుకు ఎస్‌బీఐ సిద్ధంగా వున్నట్లు.. అలాంటి వారు రుణాలు పొందవచ్చునని ఎస్‌బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. రుణం కోసం దరఖాస్తు చేసుకున్న గంటలోపు ఈ రుణాలు పొందవచ్చు. 
 
ఆరునెలల తర్వాత ఈ రుణానికి వడ్డీ కట్టడం చేస్తే చాలు. ఇంతవరకు ఇతరత్రా రుణాలు పొందిన వారు కూడా ఈ కరోనా చికిత్స కోసం రుణాలు పొందవచ్చు. ఎస్‌బీఐ తరహాలో ఇతర బ్యాంకులు కూడా కరోనా చికిత్స కోసం రుణాలు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్‌లో 396 కరోనా కేసులు.. ప్రపంచంలో మృతుల సంఖ్య 14,655