Webdunia - Bharat's app for daily news and videos

Install App

విక్రాంత్‌, మెహ‌రీన్ పిర్జాదా, రుక్స‌ర్ థిల్లాన్ నటించిన స్పార్క్L.I.F.Eలో సిద్ శ్రీరామ్

Webdunia
గురువారం, 14 సెప్టెంబరు 2023 (13:23 IST)
Vikrant, Ruksar Dhillon
విక్రాంత్‌, మెహ‌రీన్ పిర్జాదా, రుక్స‌ర్ థిల్లాన్ హీరో హీరోయిన్స్‌గా భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ప్రెస్టీజియ‌స్ మూవీ ‘స్పార్క్L.I.F.E’. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఈ సినిమాలో హీరోగా నటించడంతో పాటు విక్రాంత్ కథ, స్క్రీన్ ప్లే అందించారు. డైరెక్షన్ చేశారు. డెఫ్ ఫ్రాగ్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ హై బడ్జెట్, టెక్నికల్ వాల్యూస్‌తో ప్రొడ్యూస్ చేసింది. సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాగా 'స్పార్క్'ను తెరకెక్కించారు. 
 
మలయాళం బ్లాక్ బస్టర్ 'హృదయం', విజయ్ దేవరకొండ 'ఖుషి' సినిమాల ఫేమ్ హేషం అబ్దుల్ వహాబ్ ‘స్పార్క్L.I.F.E’కు సంగీతం అందిస్తున్నారు. ఈ రోజు సినిమాలో మొదటి పాట 'ఏమా అందం'ను విడుదల చేశారు. అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించిన ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించారు. 
 
విశాఖలోని ఓ కాలేజీలో జరిగిన కార్యక్రమంలో ఈ పాటను విడుదల చేశారు. హేషం అందించిన అద్భుతమైన బాణీకి అనంత శ్రీరామ్ సాహిత్యం, సిద్ శ్రీరామ్ గాత్రం తోడు కావడంతో ఇన్స్టంట్ చార్ట్ బస్టర్‌గా నిలిచింది. హీరో విక్రాంత్, హీరోయిన్ రుక్సార్ థిల్లాన్ మీద ఈ పాటను తెరకెక్కించారు. విజువలైజేషన్ కూడా ప్లజెంట్‌గా ఉంది. ఆడియన్స్‌ను అట్ట్రాక్ట్ చేస్తుంది. ఆల్రెడీ రిలీజైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. నవంబర్ 17న ఈ సినిమా విడుదల చేయనున్నారు. 
 
‘స్పార్క్’ మూవీ షూటింగ్ అంతా పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్ష‌న్ పనులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. మలయాళ విలక్ష‌ణ న‌టుడు గురు సోమ‌సుంద‌రం ప్రతినాయకుడి పాత్ర‌లో అల‌రించ‌బోతున్నారు. ఇంకా ఈ చిత్రంలో నాజ‌ర్‌, సుహాసిని మ‌ణిర‌త్నం, వెన్నెల కిషోర్‌, స‌త్య‌, బ్రహ్మాజీ, శ్రీకాంత్ అయ్యంగార్‌, చమ్మక్ చంద్ర, అన్న‌పూర్ణ‌మ్మ‌, రాజా రవీంద్ర త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. తెలుగు, త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ అవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్ణుడి మరణం- పోలవరం వెనుక అనేక కారణాలు.. వైఎస్ షర్మిల

ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజనపై తెలుగు రాష్ట్రాలకు నో ఇంట్రెస్ట్

తెలంగాణలో కూడా జనసేన యాక్టివ్‌గా వుంటుంది.. పవన్ కళ్యాణ్

తిరుమలలో ఏనుగుల గుంపు హల్ చల్ -భయాందోళనలో భక్తులు

ఏపీ ఎన్నికల ఫలితాలు.. రాజకీయాలు వద్దు.. హిమాలయాలకు జగన్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments