Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దండలు మార్చుకున్న మెహ్రీన్ పిర్జాదా, అనిఖా సురేంద్రన్

Mehreen Pirzada and Anikha Surendran
, గురువారం, 6 జులై 2023 (23:03 IST)
Mehreen Pirzada and Anikha Surendran
మెహ్రీన్ పిర్జాదా, అనిఖా సురేంద్రన్ ఇద్దరు ఒకరి మెడలో మరొకరు పూలదండలు మార్చుకున్నారు. ఈ సరదా సంఘటన నేడు చెనై లో జరిగింది. టాలీవుడ్‌లో పేరు తెచ్చుకున్న మెహ్రీన్ పిర్జాదా ఓ  సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. ధనుష్ నటించిన పట్టాస్ చిత్రంలో ఆమె ప్రధాన పాత్ర పోషించింది. అజిత్ కుమార్ హీరోగా నటించిన విశ్వాసం సినిమాలో కూతురి పాత్రలో కనిపించిన అనిఖా సురేంద్రన్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ఇంకా పేరు ఖారారు కానీ ఈ సినిమా పూజ చెన్నైలో జరిగింది. దర్శకుడు అమీర్ పూజా కార్యక్రమంలో పాల్గొని చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. త్వరలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.
 
లేడీ సూపర్ స్టార్ నయనతార 'ఐరా', మద్రాస్ టాకీస్ ప్రొడక్షన్స్ 'నవరస' సిరీస్‌లో పనిచేసిన దర్శకుడు శబరీష్ నంద కొత్త చిత్రానికి సైన్ చేశారు. ఆసక్తికరమైన కథాంశంతో ప్రముఖ తారాగణంతో ఈ చిత్రం రూపొందనుంది. ఇంతకుముందు హాట్‌స్టార్ కోసం ‘వి ఆర్ ప్రెగ్నెంట్’ అనే వెబ్ సిరీస్ చేశారు శబరీష్ నంద. దీనికి మంచి స్పందన వచ్చింది.
 
ఇప్పుడు దర్శకుడు శబరీష్ ఏఆర్‌ JSM ప్రొడక్షన్స్ జాఫర్ సాదిక్, ఎంపరర్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇర్ఫాన్ మాలిక్ తో చేతులు కలిపారు. విభిన్నమైన స్క్రిప్ట్‌లతో ఆకట్టుకునే వసంత్ రవి ఈ చిత్రం ప్రధాన పాత్ర పోహిస్తున్నారు. వసంత్ రవి గత సినిమాలు తరమణి, రాకీ ఇటీవల విడుదలైన అస్విన్స్ ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి.
 
ఈ చిత్రంలో పుష్పా లో కీలక పాత్ర చేసిన సునీల్‌ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం సునీల్ జైలర్, దర్శకుడు శంకర్‌ రామ్ చరణ్ చిత్రం, శివకార్తికేయన్ మావీరన్,  జపాన్  చిత్రాలలో కీలక పాత్రలు చేస్తున్నారు.
 
కొరియోగ్రాఫర్ కళ్యాణ్ ఈ చిత్రంలో బ్యాడ్  పోలీసు పాత్రను చేయబోతున్నారు. చిత్రానికి సూర్యరాజీవన్ ఆర్ట్, ప్రభాకరన్ రాఘవన్ సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ కెఎల్ కట్స్ అందిస్తున్నారు. ఇంతకు ముందు ఐశ్వర్య రాజేష్ నటించిన సొప్పన సుందరి చిత్రానికి సంగీతం అందించిన అజ్మల్ తాసీన్ సంగీతం సమకూరుస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేనేనా అంటున్న రెజీనాకు ఏమైంది!