Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సైకలాజికల్ హారర్ థ్రిల్లర్స్ తో సరికొత్తగా అశ్విన్స్

Advertiesment
Asvins poster
, బుధవారం, 21 జూన్ 2023 (17:58 IST)
Asvins poster
సస్పెన్స్ థ్రిల్లర్స్  సినిమాలకు ఆడియన్ ఎప్పుడూ ఉంటారు. కనుక కొత్త వారు ఈ కథలను బేస్ చేసుకొని తీస్తుంటారు. గతంలో పలు సినిమాలు విజయవంతమయ్యాయి. తాజాగా తమిళ భాషల్లో తెరకెక్కిన ద్విభాషా చిత్రం ‘అశ్విన్స్’  తెలుగులో ప్రముఖ నిర్మాత బివిఎస్.ఎన్ ప్రసాద్ రిలీజ్ చేస్తున్నారు. జూన్ 23న విడుదల కానున్న సినిమాలు నేడు ప్రివ్యూ వేశారు.  ‘తారామణి’ ఫేం వసంత్ రవి,  మరో నలుగురు కలిసి నటించిన ఈ చిత్రానికి ప్రమోషన్స్ కూడా విభిన్నంగా చేస్తోంది చిత్ర బృందం. తమ చిత్రాన్ని కేవలం 18 సం.లకు పై బడిన వారు మాత్రమే చూడాలంటూ... ఇందులో ఎంత హారర్ ఎలిమెంట్స్ ఉన్నాయో.ఒక రకంగా థియేటర్స్ కి వచ్చే ప్రేక్షకులకు హింట్ కూడా ఇస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలా ఉందొ చూదాం. 
 
కథ.
ఒక ఊరిలో రైతుకు ఇద్దరు కుమారులు. వారు చెరువులో మునిగి చనిపోతారు. పురాణాల్లో చెప్పినట్లు రైతు  అశ్వినీదేవతల కోసం తపస్సు చేసి తన కుమారులను బతికించాలని వేడుకుంటాడు. దాంతో అశ్వినీదేవతలు ప్రత్యక్షమై  ఓ కుమారుడిని మాత్రమే బతికించి అతనికి ప్రకృతి కారణంగా మాత్రమే మరణం సంభవిస్తుందని.రైతుకు చెప్పి రెండు బొమ్మలు ఇస్తారు. ఇదంతా ఓ రాక్షసుడు చాటుగా విని తాను భూమిపైకి రావాలంటే బొమ్మ సరైన మార్గం అని భావిస్తాడు. ఆ రైతు కొడుకు (హీరో)తో నీ బ్రదర్ ను బతికిస్తా.. అంధుడు నీ దగ్గర  ఉన్న ఒక బొమ్మ నాకు ఇవ్వమని అడుగుతాడు. అది నమ్మి అతనికి ఇస్తాడు. ఆతర్వాత ఏమి జరిగింది. అంతేకాక హీరోతో పాటు నలుగురు కలిసి ఆత్మలను షూట్ చేయాలనే ప్లాన్తో ఓ  పాడుబడిన బంగలోకి వెళతారు. అక్కడ వారికి ఎదురైన అనుభవాలే మిగిలిన సినిమా. 
 
 సమీక్ష:
ఈ కథ వింటేనే చాల ఆసాక్షిగా ఉంది. అశ్విన్స్ అంటేనే అశ్వినీదేవతలు అని కథలో చెప్పేసాడు. దర్శకుడు తరుణ్ తేజ సరికొత్త కథతో ముందుకు వచ్చాడు. రొటీన్ కతలు కాకుండా తాను చేసిన ప్రయోగం అభినందనీయం.  ప్రతి మనిషిలోనూ రెండు కోనాలుంటాయి. అందులో మంచి ఒకటి కాగా మరొకటి చెడు. ఈ రెండింటినీ కంట్రోల్ చేసే శక్తి కూడా మనిషికే ఉంటుందని చూపించారు. మనిషి బుద్ధి మంచి వైపు వెళదామని చెబితే... మనసు మాత్ర చెడు వైపు చూయిస్తుంది. దానిని మనం ఎంతో నిగ్రహంతో మంచి వైపు ప్రయాణించడానికే ప్రయత్నించాలని ఇన్నర్ మెసేజ్ ఇచ్చాడు.
 
 వసంత్ రవి పోషించిన రెండు పాత్రల ద్వారా. ఫస్ట్ హాఫ్ అంతా రొటీన్ హారర్ చిత్రాల్లోలాగే ఓ పెద్ద భవంతిలోకి ఓ ఐదుగురు యువకులను తీసుకెళ్ళి... అక్కడ చిత్ర విచిత్ర సౌండ్లతో ఆడియన్స్ ని హారర్ ఎత్తించడానికి చేసిన ప్రయత్నాలు ఓ మోస్తారుగా సక్సెస్ అయ్యాయి. అయితే... సెకెండాఫ్ లో ఆర్కియాలజిస్ట్ ఆర్తి రాజగోపాల్( విమలా రామన్) చాప్టర్ తో అసలు సినిమా స్వభావం ఏంటో తెలిసిపోతుంది. ఫస్ట్ హాఫ్ లో భయపెట్టి సెకెండాఫ్ లో అసలు కథలోకి వెల్లడంతో ప్రేక్షకులు ఈ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ కి బాగా ఎంగేజ్ అవుతారు. 
 
అర్జున్ పాత్రలో కనిపించిన హీరో వసంత్ రవి. మరో పాత్రలలోనూ వేరియేషన్ తో. ఆకట్టుకున్నారు. ఇక విమలా రామన్ ఆర్కియాలజిస్ట్ గా మంచి పాత్ర పోషించింది. మిగతా నాలుగు పాత్రలు ఓకే. ఇందులో డైరెక్టర్ రాజీవ్ మీనన్ కుమార్తె సరస్వతీ మీనన్ కూడా ఓ పాత్ర పోషించారు.
 
ఇలాంటి సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కెలకం. అది విజయ్ సిద్ధార్థ్ అందించారు. ఓ దశలో  ఆడియన్స్ ని భయపెట్టిస్తుంది. ఎ.ఎం.ఎడ్విన్ సాకే సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటర్ వెంకట్రాజన్ సినిమా నిడివిని ఇంకాస్త తగ్గిస్తే బాగుండు. నిర్మాత బి.వి.ఎస్.రవి నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. సరికొత్త పాయింట్. కథనం ఇంకాస్త మెఱుగాఉంటే అద్భుతమైన సినిమాగా నిలిచేది. 
రేటింగ్: 3/5

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రభుదేవా కుమార్తె పేరు నయనతార?