ఖుషి 100 లక్కీ ఫ్యామిలీస్ పేర్లు ప్రకటించిన విజయ్ దేవరకొండ

Webdunia
గురువారం, 14 సెప్టెంబరు 2023 (13:01 IST)
Kushi 100 family list
"ఖుషి" సినిమాకు ఘన విజయాన్ని అందించిన అభిమానులతో తన సంతోషాన్ని పంచుకోవాలని ఉందని, ఇందుకు 100 ఫ్యామిలీస్ ను ఎంపికచేసి వారికి లక్ష రూపాయల చొప్పున కోటి రూపాయలు అందిస్తామని హీరో విజయ్ దేవరకొండ ఖుషి వైజాగ్ సక్సెస్ సెలబ్రేషన్స్ ఈవెంట్ లో అనౌన్స్ చేశారు. ఆ రోజు వేదిక మీద చెప్పినట్లే..ఇవాళ 100 మంది లక్కీ ఫ్యామిలీస్ ను ఎంపికచేసి ఆ లిస్టును రిలీజ్ చేశారు విజయ్.

ఈ జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల నుంచి ఫ్యామిలీస్ మాత్రమే కాకుండా కర్ణాటక, తమిళనాడు లోని ప్రాంతాల నుంచి కూడా విజేతలను ఎంపిక చేయడం విశేషం. త్వరలోనే వీరికి హైదరాబాద్ లో జరిగే ఖుషి గ్రాండ్ ఈవెంట్ లో చెక్స్ పంపిణీ చేయబోతున్నారు.
 
హీరో విజయ్ దేవరకొండ ట్వీట్ చేస్తూ - ఖుషి హ్యాపీనెస్ షేర్ చేసుకునేందుకు ఈ వంద మంది ఫ్యామిలీస్ ను ఎంపిక చేశాం. ఈ లిస్టులో పేరున్న కుటుంబాలు ఎంతో ఆనందిస్తాయని ఆశిస్తున్నా. అంటూ పేర్కొన్నారు. ఖుషి సినిమాను విజయ్ దేవరకొండ, సమంత జంటగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఈ నెల 1న రిలీజై సూపర్ హిట్ అందుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సిడ్నీలో రోడ్డు ప్రమాదం.. రోడ్డు దాటిన 8నెలల గర్భవతి.. భారతీయ మహిళ మృతి

శబరిమలలో భారీ రద్దీ.. స్పృహ కోల్పోయి మృతి చెందిన మహిళా భక్తురాలు

నవంబర్ 22 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు

మీరు కూడా దేవుళ్లే అంటూ చెప్పిన సత్యసాయి జయంతి ఉత్సవాలకు ప్రధానమంత్రి మోడి

పదేళ్ల క్రితం నిర్వహించిన గ్రూపు-2 పరీక్ష రద్దు : తెలంగాణ హైకోర్టు ఆదేశాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments