షాకింగ్ - హీరో రాజ్‌ తరుణ్‌ తండ్రికి మూడేళ్ల జైలు శిక్ష

ప్రముఖ యువ క‌థానాయ‌కుడు రాజ్ తరుణ్ తండ్రి నిడమర్తి బసవరాజుకు మూడు సంవత్సరాల జైలు శిక్ష, రూ. 20 వేల జరిమానా విధిస్తూ, విశాఖపట్నం రెండో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ సన్నీ పర్విన్‌ సుల్తానాబేగం తీర్పు ఇచ్చారు. అస‌లు ఏం జ‌రిగిందంటే... స్టేట్

Webdunia
శనివారం, 21 ఏప్రియల్ 2018 (14:44 IST)
ప్రముఖ యువ క‌థానాయ‌కుడు రాజ్ తరుణ్ తండ్రి నిడమర్తి బసవరాజుకు మూడు సంవత్సరాల జైలు శిక్ష, రూ. 20 వేల జరిమానా విధిస్తూ, విశాఖపట్నం రెండో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ సన్నీ పర్విన్‌ సుల్తానాబేగం తీర్పు ఇచ్చారు. అస‌లు ఏం జ‌రిగిందంటే... స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషల్ అసిస్టెంట్ క్యాషియర్‌గా 2013 ప్రాంతంలో పని చేసిన ఆయన, నకిలీ బంగారాన్ని కుదవపెట్టి రుణం పొందినట్టు ఆరోపణలు ఉన్నాయి.
 
తన భార్య రాజ్యలక్ష్మితో పాటు, పరిసర ప్రాంతాలకు చెందిన పలువురి పేర్ల మీద నకిలీ బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టించిన ఆయన రూ. 9.85 లక్షల రుణం పొందారు. ఆపై బ్యాంకు అధికారుల ఆడిటింగ్‌లో ఈ విషయం బయటపడింది. దీంతో అప్పట్లో బ్యాంకు మేనేజర్‌గా ఉన్న గరికపాటి సుబ్రహ్మణ్యం పోలీసుల‌కు ఫిర్యాదు చేసారు. కేసు కోర్టుకు వెళ్లడంతో, విచారణ జరిపిన సుల్తానా బేగం, బ‌స‌వ‌రాజుకు 3 సంవ‌త్స‌రాల జైలు శిక్ష 20 వేల జ‌రిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు. పాపం... రాజ్ త‌రుణ్!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీనియర్ ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారు.. మూడేళ్లలో రూ.2.41 కోట్లు సంపాదించాను.. ప్రశాంత్ కిషోర్

Malla Reddy: రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోవిడ్ కంటే దారుణమైనది.. మల్లారెడ్డి ధ్వజం

రాయదుర్గంలో రికార్డు స్థాయిలో భూమి ధర.. ఎకరం భూమి రూ.177 కోట్లు

Vijayawada: విజయవాడలో ఆ వర్గాలకు ప్రాతినిధ్యం ఇవ్వని వైకాపా.. ఎదురు దెబ్బ తప్పదా?

Polavaram: 2019లో టీడీపీ గెలిచి ఉంటే, పోలవరం 2021-22 నాటికి పూర్తయ్యేది-నిమ్మల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments