అమ్మతోడు... నేను మాటమీద నిలబడనంటే నిలబడను.. ఆర్జీవీ

వివాదాలకు కేరాఫ్ చిరునామాగా మారిన దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోమారు రెచ్చిపోయారు. తన తల్లిమీద వేసిన ఒట్టును సైతం పక్కనబెట్టేశాడు. పైగా, తాను మాటమీద నిలబడే వ్యక్తిని కాదని మరోమారు తన చేతల ద్వారా నిరూపించ

Webdunia
శనివారం, 21 ఏప్రియల్ 2018 (11:53 IST)
వివాదాలకు కేరాఫ్ చిరునామాగా మారిన దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోమారు రెచ్చిపోయారు. తన తల్లిమీద వేసిన ఒట్టును సైతం పక్కనబెట్టేశాడు. పైగా, తాను మాటమీద నిలబడే వ్యక్తిని కాదని మరోమారు తన చేతల ద్వారా నిరూపించారు.
 
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, శ్రీరెడ్డి ఎపిసోడ్‌ వ్యవహారంపై ఆర్జీవీ శనివారం మరోమారు స్పందించరు. పవన్ విషయంలో తాను చేసింది నూటికి నూరు శాతం క్షమించరాని తప్పు అని చెప్పారు. మళ్లీ ఇంకొకసారి అల్లు అరవింద్‌కు, పవన్ కళ్యాణ్‌కి, మెగా కుటుంబ సభ్యులకీ, ఫాన్స్‌కీ అందరికీ క్షమాపణ చెప్పుకుంటున్నానన్నారు. పైగా, మళ్లీ ఎప్పుడూ పవన్ మీద కానీ, మిగతా ఫ్యామిలీ మెంబెర్స్ మీద కానీ నెగిటివ్ కామెంట్స్ పెట్టనని తన తల్లి మీద, తన వృత్తి మీద ఒట్టేసి చెబుతున్నానన్నారు. గతంలో తాను ఒట్లు నిలబెట్టుకోకపోయుండచ్చు కానీ, తన తల్లి మీద తానెప్పుడూ ఒట్టేయ్యలేదన్నారు.
 
అయితే, తాజాగా ఆ ఒట్టుతీసి గట్టున పెట్టేశారు. దానికి కారణం కూడా వర్మ వివరించారు. 'నేను చేసిన పనికి సారీ చెప్పి పీకే మీద ఇక కామెంట్ చెయ్యనని మా అమ్మ మీద ఒట్టు వేశాను. ఆ తర్వాత కూడా నేను చంద్రబాబు, లోకేష్, శ్రీని రాజు, ఆర్కే, రవిప్రకాష్, మూర్తి కూటమిలో ఉన్నానని ఆరోపించడం మూలాన మా అమ్మ అంగీకారంతో ఇప్పుడు నా ఒట్టు తీసి గట్టు మీద పెట్టాను'. ఇకపై యధావిధిగా విమర్శలు గుప్పిస్తాను అంటూ తన చేతల ద్వారా చెప్పకనే చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ముప్పు పొంచివుంది.. భారత్‌తో యుద్ధం జరిగితే పాక్ గెలుపు తథ్యం : ఆసిఫ్

జూబ్లీహిల్స్ ఉప పోరు : కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరు ఖరారు

హవ్వ... కారుపై కూర్చుని నడిరోడ్డుపై వెళ్తూ జంట రొమాన్స్ (video)

కోల్డ్‌రిఫ్ దగ్గుమందు తయారీ కంపెనీపై చర్యలేవి? తమిళనాడు సర్కారుపై కేంద్రం ఆగ్రహం

ఢిల్లీ - కోల్‌కతా హైవేపై 4 రోజులుగా భారీ ట్రాఫిక్ జామ్ - ఆకలితో అలమటిస్తున్న ప్రయాణికులు (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

తర్వాతి కథనం
Show comments