Webdunia - Bharat's app for daily news and videos

Install App

'భరత్ అనే నేను'.. రోజువారీ లెక్కలు తిరగరాస్తున్నా...

ప్రిన్స్ మహేష్ బాబు, కైరా అద్వానీ జంటగా, కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన చిత్రం "భరత్ అనే నేను". ఈ చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రం విడుదలైన మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ ద‌క్కించు

Webdunia
శనివారం, 21 ఏప్రియల్ 2018 (11:39 IST)
ప్రిన్స్ మహేష్ బాబు, కైరా అద్వానీ జంటగా, కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన చిత్రం "భరత్ అనే నేను". ఈ చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రం విడుదలైన మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ ద‌క్కించుకుంది. 
 
ప్ర‌స్తుతం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వ‌సూళ్ళ ప్ర‌భంజ‌నం సృష్టిస్తుంది. మొన్న‌టి వ‌ర‌కు "రంగ‌స్థ‌లం" చిత్రంపై ఉన్న రికార్డులని తుడిపేస్తుంది. చ‌ర‌ణ్ న‌టించిన 'రంగ‌స్థ‌లం' చిత్రం తొలి రోజున త‌మిళ‌నాడులో రూ.25 ల‌క్ష‌ల గ్రాస్‌ని క‌లెక్ట్ చేయ‌గా, 'భ‌ర‌త్ అనే నేను' రూ.27 ల‌క్ష‌లకి పైగా గ్రాస్ వ‌సూలు చేసి స‌రికొత్త రికార్డు సృష్టించింది. నిజానికి మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన 'స్పైడ‌ర్' చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదలైంది. ఈ చిత్రంతో మ‌హేష్‌కి త‌మిళ రాష్ట్రాల‌లోను ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.
 
ఈ క్ర‌మంలో అక్క‌డ మ‌రిన్ని వ‌సూళ్ళు రాబ‌ట్టొచ్చని స‌మాచారం. ఇక ఆస్ట్రేలియాలోనూ 'భ‌ర‌త్ అనే నేను' మూవీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంటలు మండిస్తుంది. అక్క‌డ 35 ప్రాంతాల‌లో ఈ చిత్రం విడుద‌ల కాగా తొలి రోజు 168,194 డాల‌ర్లు (85.45ల‌క్ష‌ల) వ‌సూళ్ళు సాధించి మ‌హేష్ స్టామినా ఏంట‌నేది నిరూపించింది. రానున్న రోజుల‌లో ఈ చిత్రం మరిన్ని రికార్డులు కొల్ట‌గొట్ట‌డం ఖాయమని ఫిల్మ్ ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

మయన్మార్‌లో భారీ భూకంపం.. పేక మేడల్లా కూలిపోయిన భవనాలు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments