Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శనివారం (21-04-2018) దినఫలాలు : రాత, మౌఖిక పరీక్షల్లో...

మేషం: స్త్రీలకు నడుము, తల, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. కళ, క్రీడ, కంప్యూటర్ రంగాల వారికి ప్రోత్సాహకరం. వృత్తుల వారికి సదవకాశాలు లభించినా ఆర్థికంగా ఆశించినంత సంతృప్తి

శనివారం (21-04-2018) దినఫలాలు : రాత, మౌఖిక పరీక్షల్లో...
, శనివారం, 21 ఏప్రియల్ 2018 (08:36 IST)
మేషం: స్త్రీలకు నడుము, తల, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. కళ, క్రీడ, కంప్యూటర్ రంగాల వారికి ప్రోత్సాహకరం. వృత్తుల వారికి సదవకాశాలు లభించినా ఆర్థికంగా ఆశించినంత సంతృప్తి ఉండదు. కొన్ని సమస్యలు చిన్నవే అయిన మనశ్శాంతిని దూరం చేస్తారు. 
 
వృషభం: కోర్టు వాదోపవాదాల్లో ప్లీడర్లు విజయం సాధిస్తారు. స్త్రీలతో సంభాషించునపుడు మెళకువ అవసరం. ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించటం మంచిది కాదని గమనించండి. పారిశ్రామికవేత్తలకు అధికారుల నుంచి అభ్యంతరాలెదుర్కోవలసివస్తుంది. గృహ నిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. 
 
మిథునం: రాజకీయనాయకులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. వాణిజ్య ఒప్పందాలు, లీజు, ఏజెన్సీలు, కాంట్రాక్టుల గడువు పొడిగింపునకు అనుకూలం. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు త్వరగా పూర్తి కాగలవు. నిరుద్యోగులు రాత, మౌఖిక పరీక్షల్లో విజయం సాధిస్తారు. స్త్రీలకు నూతన పరిచయాలేర్పడతాయి. 
 
కర్కాటకం: ఫ్యాన్సీ, కిళ్ళీ, కిరాణా రంగాలలో వారికి అనుకూలం. ప్రత్యర్థులను సైతం మీ వైపునకు తిప్పుకోగలుగుతారు. స్థిరచరాస్తుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. మీ సంతానం కోసం ధనం బాగా వెచ్చిస్తారు.
 
సింహం: స్త్రీలు షాపింగ్‌లో దుబారా ఖర్చులు ఎక్కువగా చేస్తారు. నిర్మాణ పనులలో పెరిగిన వ్యయం, జాప్యం ఆందోళన కలిగిస్తుంది. బంధువులను కలుసుకుంటారు. పూర్వానుభవంతో ముందుకు సాగుతారు. ఉద్యోగంలో శ్రమకు నైపుణ్యతకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ కార్యక్రమాలు, పనులు వాయిదా వేసుకోవలసి వస్తుంది.
 
కన్య: ప్రైవేటు సంస్థల్లోని వారు ఓర్పు, అంకితభావంతో పనిచేసినాగానీ నిలదొక్కుకోలేరు. ఖర్చులు పెరగటంతో అదనపు రాబడికై యత్నిస్తారు. ఓర్పు, కార్యదీక్షతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. లీజు, ఏజెన్సీ, నూతన పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. 
 
తుల: ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. మీ తొందరపాటుతనం వల్ల కుటుంబంలో ప్రశాంతత లోపిస్తుంది. పట్టు, ఖాదీ, కలంకారీ, చేనేత వస్త్ర, వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. పోటీపరీక్షలలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఆహ్వానం మీకెంతో సంతృప్తినిస్తాయి. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి.
 
వృశ్చికం: గృహంలో విలువైన వస్తువులు అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుకుంది. భాగస్వామిక ఒప్పందాలు, ప్రముఖులతో చర్చలు సత్ఫలితాలిస్తాయి. బంధుమిత్రులతో ప్రయాణాలు సాగిస్తారు. స్త్రీలకు ఆరోగ్య, ఆహార వ్యవహారాల్లో మెళకువ అవసరం. అద్దె ఇంటి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. 
 
ధనస్సు: గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. శ్రీవారు శ్రీమతి ఆర్యోగం పట్ల శ్రద్ధ చూపిస్తారు. నిరుద్యోగులకు సదవకాశాలు లభించగలవు. శత్రువులు మిత్రులుగా మారి సహయ సహకారాలు అందిస్తారు. ఊహించని ఖర్చు వల్ల చేబదుళ్ళు తప్పవు. బ్యాంకింగ్ రంగాల వారికి పనిలో ఒత్తిడిని ఎదుర్కుంటారు.
 
మకరం: వ్యాపారాభివృద్ధికై చేయు కృషిలో పోటీ వాతావరణం అధికమవ్వటంతో ఆందోళన చెందుతారు. ఒక కార్యం నిమిత్తం తరచు ప్రయాణాలు తప్పవు. మీ వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులకు గురికాకండి. స్థిరచరాస్తుల క్రయ విక్రయాలకు సంబంధించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు.
 
కుంభం: స్త్రీల సరదాలు, అవసరాలు వాయిదా వేసుకోవలసివస్తుంది. ఖర్చులు అధికమవుతాయి. మీ ప్రయాణాలు, కార్యక్రమాలకు స్వల్ప ఆటంకాలెదురవుతాయి. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఆధ్యాత్మిక చింతన పట్ల ఆసక్తి పెరుగుతుంది. సోదరీసోదరులతో అనుకోని ఇబ్బందులు, చికాకులను ఎదుర్కుంటారు.
 
మీనం: ఉపాధ్యాయులకు, విద్యా సంస్థలకు ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. ముఖ్యమైన విషయాలలో అనాలోచితంగా వ్యవహరించటం వల్ల విమర్శలు తప్పవు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. కొబ్బరి, పండ్ల, పానీయ, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు స్వీకరించడం వల్ల క్షణం తీరిక ఉండదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్ఫటిక లింగాన్ని పది నిమిషాలు అలా చూస్తూ నిలబడితేనే?