Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 4 April 2025
webdunia

మంగళవారం (17-04-18) దినఫలాలు .. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల...

మేషం: స్త్రీలకు చుట్టుపక్కల వారితో సత్సంబంధాలు నెలకొంటాయి. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మార్కెటింగ్ రంగంలోని వారికి ఒత్తిడి, శ్రమాధిక్యత తప్పవు. సంఘంలో ఉన్నతస్థాయి వ

Advertiesment
Daily Horoscope
, మంగళవారం, 17 ఏప్రియల్ 2018 (08:44 IST)
మేషం: స్త్రీలకు చుట్టుపక్కల వారితో సత్సంబంధాలు నెలకొంటాయి. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మార్కెటింగ్ రంగంలోని వారికి ఒత్తిడి, శ్రమాధిక్యత తప్పవు. సంఘంలో ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు మీ పురోభివృద్ధికి నాంది పలుకుతాయి. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది.
 
వృషభం: చేపట్టిన పనులు కొంత ఆలస్యంగానైనా సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. సోదరుల విషయంలో విబేధాలు తలెత్తే సూచనలు కలవు. వ్యాపారస్తులకు కొత్త ప్రాజెక్టులు అందుతాయి. పాత రుణాలు తీరుస్తారు. దూర ప్రయాణాల్లో ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ సంతానం మొండి వైఖరి మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. 
 
మిథునం: ప్రత్తి, పొగాకు వ్యాపారులకు ఆశాజనకంగా ఉంటుంది. మీ పొదుపరితనం కుటుంబ సభ్యులకు చికాకు కలిగిస్తుంది. కపటం లేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించిపెడుతుంది. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. 
 
కర్కాటకం: స్త్రీలకు ఆర్థికపరమైన సమస్యలు అధికమవుతాయి. షాపింగ్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. గతంలో ఇచ్చిన హామీల వల్ల వర్తమానంలో ఇబ్బందులెదురవుతాయి. షాపింగ్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. గతంలో ఇచ్చిన హామీల వల్ల వర్తమానంలో ఇబ్బందులెదురవుతాయి. నిర్మాణ పనులు చురుకుగా సాగటంతో కొత్త ఉత్సాహం పొందుతారు. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి.
 
సింహం: వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ వుండదు. ఏదైనా స్థిరాస్తి కొనుగోలు చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. బ్యాంకింగ్ పనులు మందకొడిగా సాగుతాయి. ఖర్చులు పెరగడంతో రుణ యత్నాలు, చేబదుళ్ళు స్వీకరిస్తారు. సంఘంలో ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు మీ పురోభివృద్ధికి నాంది పలుకుతాయి.
 
కన్య: రావలసిన ధనం అందటంతో ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీ వుండదు. మార్కెటింగ్, ప్రైవేట్, పత్రికా రంగంలోని వారికి అధిక శ్రమ తప్పదు. ఉద్యోగరీత్యా ఆకస్మికంగా ప్రయాణం చేయవలసివస్తుంది. కష్ట సమయంలో బంధువులు అండగా నిలుస్తారు. స్త్రీలకు కొత్త వ్యాపకాలు, ఆలోచనలు స్ఫురిస్తాయి. 
 
తుల: మీ అభిరుచికి తగిన వ్యక్తితో పరిచయాలేర్పడతాయి. విలువైన కానుకలందించి ప్రముఖులను ఆకట్టుకుంటారు. మొండి బకాయిలు వసూలు కాగలవు. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లకు ఏకాగ్రత, పర్యవేక్షణ ఎంతో అవసరం. ద్విచక్రవాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం.
 
వృశ్చికం: ఆర్థికంగా ఎదగాలనే మీ ఆశయం నిదానంగా ఫలిస్తుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. మీ ఉన్నతిని చాటుకోవాలనే తాపత్రయంతో ధనం విచ్చలవిడిగా వ్యయం చేస్తారు. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. పత్రికా సంస్థల్లోని వారు ఎంత శ్రమించినా గుర్తింపు ఏమాత్రం ఉండదు.
 
ధనస్సు: హోటల్, క్యాటరింగ్ రంగాల వారికి కలిసివస్తుంది. సంగీత, నృత్య కళాకారులకు గుర్తింపు లభిస్తుంది. స్త్రీలకు పుట్టంటిపై మమకారం పెరుగుతుంది. కొంతమంది మీపై ఆధిపత్యం చెలాయించేందుకు యత్నిస్తారు. ఆకస్మికంగా మీలో వేదాంత ధోరణి కానరాగలదు. విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు.
 
మకరం: ఇతరులకు పెద్ద మొత్తంలో ధనం ఇవ్వడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. స్వయం కృషితో బాగా రాణిస్తారు. విద్యార్థులకు తోటివారి వల్ల సమస్యలు తప్పవు. ఉద్యోగస్తులు విలువైన కానుకలు అందించి అధికారులను ప్రసన్నం చేసుకుంటారు.
 
కుంభం: స్త్రీలకు టీవీ, కార్యక్రమాలకు సంబంధించిన ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తుల అమ్మకానికై చేసే యత్నాలు వాయిదా పడటం మంచిది. ఆత్మీయుల నుంచి బహుమతులు అందుకుంటారు. ఏ విషయంలోను ఏకపక్ష నిర్ణయం మంచిది కాదు. దూర ప్రయాణాల్లో కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు.
 
మీనం: నేడు చేద్దామనుకున్న పనులు రేపటికి వాయిదా వేస్తారు. బ్యాంకింగ్ రంగంలోని వారికి పనిభారం, ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. స్త్రీలకు చుట్టు పక్కల వారితో లౌక్యం చాలా అవసరం. కోర్టు వ్యాజ్యాలు, ఫిర్యాదులు ఉపసంహరించుకుంటారు. రాజకీయ నాయకులు సభా సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అంతర్వేది, నెల్లూరు పెంచలకోన... లక్ష్మీనరసింహ స్వామి