Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గురువారం (12-04-18) దినఫలాలు ... సంఘంలో మీ ఉన్నతికి...

మేషం : ఓ మంచి వ్యక్తి అభిమానాన్ని పొందుతారు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయసాలు తప్పవు. గృహం కొనుగోలుకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. కోర్టు వ్యవహారాలు, ఆస్తి తగాదాలు ఒక కొలిక్

Advertiesment
Daily Horoscope
, గురువారం, 12 ఏప్రియల్ 2018 (08:39 IST)
మేషం : ఓ మంచి వ్యక్తి అభిమానాన్ని పొందుతారు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయసాలు తప్పవు. గృహం కొనుగోలుకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. కోర్టు వ్యవహారాలు, ఆస్తి తగాదాలు ఒక కొలిక్కి రాగలవు. టెండర్లు చేజిక్కించుకుంటారు. ఉత్తరప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. 
 
వృషభం : హోటల్, కేటరింగ్ రంగాల వారికి పనిభారం అధికమవుతుంది. ఊహించని ఖర్చులు ఎదురైనా ఇబ్బందులు అంతగా ఉండవు. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు ఊహించని ఆటంకాలెదురవుతాయి. క్రయ విక్రయాలు సంతృప్తినిస్తాయి. దైవ కార్యల్లో పాల్గొంటారు. మిమ్మలను పొగిడే వ్యక్తుల పట్ల జాగ్రత్త వహించండి. 
 
మిథునం : పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. కంది, మినుము, పెసర, ఎండుమిర్చి, నూనె వ్యాపారస్తులకు మెలకువ అవసరం. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఏకాగ్రత ముఖ్యం. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. 
 
కర్కాటకం : సంఘంలో మీ ఉన్నతికి, పరపతికి గౌరవం, గుర్తింపు లభిస్తాయి. మితిమీరిన ఆలోచనలు శ్రమాధిక్యత వల్ల స్వల్ప అనారోగ్యానికి గురవుతారు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. వారసత్వపు వ్యవహారాలలో సమస్యలు వంటివి తలెత్తుతాయి. విద్యార్థుల్లో మనోధైర్యం నెలకొంటుంది. 
 
సింహం : గృహోపకరణాలకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. నెలసరి వాయిదాలు సకాలంలో చెల్లిస్తారు. సోదరీ, సోదరులతో ఏకీభవించలేరు. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. బంధు మిత్రులను కలుసుకుంటారు. పండ్లు, కొబ్బరి, పూలు, చల్లని పానీయ వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. 
 
కన్య : పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలో వారికి అనుకూలం. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సామాన్య ఫలితాలనే ఇస్తాయి. మొండి బాకీల వసూళ్ళ వంటి శుభ సంకేతాలున్నాయి. నూతన దంపతుల మధ్య సంబంధ బాంధవ్యాలు బాగా ఉంటాయి. కోర్టు వ్యవహారాలు, భూ వివాదాలు పరిష్కారమయ్యే సూచనలున్నాయి. 
 
తుల : దంపతుల మధ్య కలహాలు, పట్టింపులు ఎదుర్కొంటారు. చేపట్టిన పనులు ఆశించినంత చురుకుగా సాగవు. ప్రముఖులతో పరిచయాలు మీ ఉన్నతికి తోడ్పడతాయి. చిన్న తరహా వృత్తులు, హోటల్, తినుబండ వ్యాపారులకు కలిసిరాగలదు. సోదరీ, సోదరులతో అనుకోని ఇబ్బందులు, చికాకులు ఎదుర్కొంటారు. 
 
వృశ్చికం : ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, మెకానికల్ రంగాల వారికి పనిభారం అధికం. విద్యార్థినులకు ప్రేమ వ్యవహారాల్లో ఒత్తిడి పెరుగుతుంది. వాహనం నడుపుతున్నపుడు జాగ్రత్త అవసరం. ప్రముఖులతో సహకారంతో మీ సమస్యలు పరిష్కారమవుతాయి. పారిశ్రామికవేత్తలకు విద్యుత్ కోతల వల్ల ఆందోళన గురవుతారు. 
 
ధనస్సు : ఉద్యోగస్తులపై అధికారుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. వృత్తిరీత్యా ప్రయాణం చేయవలసి వస్తుంది. మీ ఆశయ సాధనకు నిరంతర కృషి అవసరం. భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలమవుతాయి. వ్యవసాయదారులకు నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి.
 
మకరం : కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్నవాటిపైనే శ్రద్ధ వహించండి. నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు సంబంధించిన లేఖలు అందుకుంటారు. వ్యాపార వర్గాల వారికి చెక్కుల జారీ, పెద్ద మొత్తంలో స్టాక్ ఉంచుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. 
 
కుంభం : స్థిరాస్తుల కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి. అనవసరమైన విషయాలలో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. ప్రయాణాల్లో తొందరపాటు అంత మంచిదికాదని గమనించండి. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. బ్యాంకింగ్ వ్యవహారాల్లో ఒత్తిడి, జాప్యం వంటి చికాకులు ఎదుర్కొంటారు. 
 
మీనం : ఆర్థిక విషయాలలో కొంత పురోభివృద్ధి కానవస్తుంది. ప్రియతముల, చిన్నారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. నిరుద్యోగులు, వృత్తులు, ప్రింటింగ్ రంగాల వారికి ఆశాజనకం. ఖర్చులు అదుపుకాకపోగా మరింత ధనవ్యయం ఖర్చవుతుంది. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తితిదే ఛైర్మన్‌గా సుధాకర్ యాదవ్.. ఆర్టీసీ ఛైర్మన్‌గా వర్ల