బుధవారం (11-04-2018) దినఫలాలు - స్త్రీలు అపరిచితులతో మితంగా...
మేషం: ఆత్మీయులకు సాయం అందిస్తారు. దైవ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. వాయిదా పడిన పనులను పునఃప్రారంభిస్తారు. వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో సఫలీకృతులవుతారు. స్త్రీలకు కళ్ళు, తల, నరాలకు సంబంధ
మేషం: ఆత్మీయులకు సాయం అందిస్తారు. దైవ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. వాయిదా పడిన పనులను పునఃప్రారంభిస్తారు. వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో సఫలీకృతులవుతారు. స్త్రీలకు కళ్ళు, తల, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. మీ పథకాలు కార్యరూపం దాల్చుతాయి.
వృషభం: వ్యవహారాల్లో జయం, గృహంలో శుభకార్యాలు అనుకూలిస్తాయి. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు నిర్మాణ పనుల్లో స్వీయ పర్యవేక్షణ అవసరం. ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా మెలగాల్సి వుంటుంది. దైవ కార్యక్రమాల కోసం ధనం బాగా వెచ్చిస్తారు. మీ శ్రీమతి ప్రోద్భలంతో ఒక శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు.
మిథునం: స్త్రీలు అపరిచితులతో మితంగా సంభాషించడం క్షేమదాయకం. రావలసిన ధనం కొంత ముందు వెనుకలగానైనా అందుతుంది. శ్రమాధిక్యత, పలు ఆలోచనల వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. విద్యార్థులు భవిష్యత్ గురించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికంగా వుంటాయి.
కర్కాటకం: కుటుంబీకులతో ముభావంగా ఉంటారు. ప్రింటంగ్, స్టేషనరీ రంగాల్లో వారికి పనిభారం అధికమవుతుంది. ఉమ్మడి వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. బ్యాంకు వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. తరచు దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆడిటర్లకు, అకౌంట్స్ రంగాల వారికి పనిభారం అధికం.
సింహం: ఆదాయానికి మించిన ఖర్చులెదురైనా ఇబ్బందులుండవు. రాజకీయ నాయకులకు కార్యకర్తల వల్ల సమస్యలను ఎదుర్కొంటారు. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమసమాచారాలు నిశ్చింత కలిగిస్తాయి. శస్త్రచికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత అవసరం. ప్రముఖుల సహకారంతో మీ సమస్యలు ఒక కొలిక్కి రాగలవు.
కన్య: కొత్తగా చేపట్టిన వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిది. బ్యాంకింగ్ వ్యవహారంలో జాగ్రత్త అవసరం. స్త్రీలకు ఇరుగు, పొరుగు వారితో సఖ్యత అంతగా వుండదు. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు.
తుల: వ్యాపారస్తులకు కొత్త ప్రాజెక్టులు అందుతాయి. అనుకోని విధంగా మీరు ప్రయాణం చేయవలసి వస్తుంది. రిజర్వేషన్ రంగాల వారు సంతృప్తిని పొందుతారు. ప్రత్యర్థులు స్నేహ హస్తం అందిస్తారు. గృహానికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. వృత్తి విద్యా కోర్సుల్లో రాణిస్తారు. స్థిరాస్తిని వృద్ధి చేసుకుంటారు.
వృశ్చికం: విపరీతమైన ఖర్చులు, చెల్లింపుల వల్ల స్వల్ప ఆటుపోట్లు తప్పవు. సోదరీ, సోదరుల మధ్య కలహాలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. కొన్ని బంధాలను నిలుపుకోవటానికి కష్టపడాల్సి వస్తుంది. చిన్నారులకు అవసరమైన వస్తువులు సేకరిస్తారు. అధికారులతో సంభాషించేటప్పుడు మెలకువ వహించండి.
ధనస్సు: డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. విదేశాల నుంచి విలువైన వస్తువులను సేకరిస్తారు. ముఖ్యమైన పనుల్లో విజయం చేకూరుతుంది. బంధువుల తోడ్పాటుతో ఒకడుగు ముందుకు సాగుతారు. ప్రతి పనిని మీ సొంత తెలివితేటలతో ఆలోచించడం వల్ల అనుకూలంగానే పూర్తవుతాయి.
మకరం: మీడియా రంగాల వారికి ఒత్తిడి, చికాకులు అధికం. మీరు చేసే వృత్తి, ఉద్యోగాల్లో మార్పు ఏర్పడవచ్చు. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, ప్రోత్సాహం లభిస్తాయి. శ్రీవారు, శ్రీమతి విషయంలో మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది. శెనగలు, కంది, చింతపండు, బెల్లం, వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు కలిసిరాగలదు.
కుంభం: పెంపుడు జంతువులపై ప్రేమ, శ్రద్ధ చూపిస్తారు. మార్కెటింగ్ రంగంలోని వారికి శ్రమాధిక్యత తప్పవు. మీ సంతానం విషయంలో సంతృప్తి కానవస్తుంది. ప్రయాణాల్లో కొంత ఇబ్బందులను ఎదుర్కొంటారు. పనులు కొంత మందకొడిగా సాగుతాయి. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది.
మీనం: రాజకీయ రంగాల వారికి పర్యటనలు అధికమవుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. పత్రికా రంగంలోని వారికి గుర్తింపు రాణింపు లభిస్తుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. తలచిన పనులలో కొంత అడ్డంకి ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. లెక్కకు మించిన బాధ్యతలతో సతమతమవుతారు.