సోమవారం (09-04-18) రాశి ఫలితాలు : మీ మౌనం వారికి గుణపాఠం..
మేషం : ఆర్థికంగా ఎదగాలనే మీ ఆశయం నిదానంగా ఫలిస్తుంది. నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు సంబంధించిన లేఖలు అందుకుంటారు. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. మీ మౌనం వారికి గుణపాఠమవుతుంది.
మేషం : ఆర్థికంగా ఎదగాలనే మీ ఆశయం నిదానంగా ఫలిస్తుంది. నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు సంబంధించిన లేఖలు అందుకుంటారు. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. మీ మౌనం వారికి గుణపాఠమవుతుంది. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి.
వృషభం : ఉపాధ్యాయుల మధ్య పరస్పర అవగాహన కుదరదు. శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. ఏ విషయంలోను హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాటవేయండి. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. స్వార్థపూరిత ప్రయోజనాలు ఆశించి మీకు చేరువవ్వాలని భావిస్తున్న వారిని దూరంగా ఉంచండి.
మిథునం : స్త్రీలకు షాపింగ్‌లోను, వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. తలపెట్టిన పనులలో జాప్యం వల్ల నిరుత్సాహం తప్పదు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. వైద్య, ఇంజనీరింగ్, శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది.
కర్కాటకం : కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. విద్యార్ధినుల్లో ఏకాగ్రత లోపంవల్ల ఒత్తిడి, ఆందోళనలకు గురవుతారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి మీ పనులు త్వరితగతిన పూర్తి చేస్తారు. క్రయ విక్రయాలు లాభదాయకం.
సింహం : ప్రేమికులకు పెద్దల నుండి వ్యతిరేకత, ఇబ్బందులు తప్పవు. నిరుద్యోగుల యత్నాలలో ఆటంకాలు ఎదుర్కొంటారు. ఒక వ్యవహారంలో మీరు తీసుకున్న నిర్ణయం కొంత ఆలస్యంగానైనా సత్ఫలితాలనిస్తుంది. ప్రయాణాలలో అపరిచితుల పట్ల మెలకువ వహించండి. విద్యార్థులకు మానసిక ప్రశాంతత లభిస్తుంది.
కన్య : రిప్రజెంటివ్‌లకు శ్రమకు తగిన ప్రతిఫలం కానరాదు. చిన్నతరహా పరిశ్రమలు, ప్రింటింగ్ రంగాల వారికి సమస్యలు తప్పవు. ఏదైనా స్ధిరాస్తి అమ్మకం చేయాలనే మీ ఆలోచన మరి కొంత కాలం వాయిదా వేయటం మంచిది. ఎరువులు, విత్తన వ్యాపారులకు పురోభివృద్ధి. వ్యవసాయ రంగంలో వారికి నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి.
తుల : పాతమిత్రుల కలయికతో మీకెంతో సంతృప్తినిస్తుంది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్వ్యూటర్ రంగాల వారికి సామాన్యం. నిరుద్యోగులకు అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించవలసి ఉంటుంది. మీ ఆశయసిద్ధికి నిరంతర శ్రమ, పట్టుదల అవసరమని గమనించండి. రోజులు భారంగా, మందకొడిగా సాగుతాయి.
వృశ్చికం : ప్రముఖుల సహకారంతో ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు అనుకూలిస్తాయి. నిత్యావసర వస్తు స్టాకిస్టులు, రేషన్ డీలర్లకు అధికారుల నుంచి వేధింపులు తప్పవు. అతిథి మర్యాదలు సమర్థంగా నిర్వహిస్తారు. విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలించవు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సంతృప్తి, పురోభివృద్ధి.
ధనస్సు : పాతమిత్రుల కలయికతో మీకెంతో సంతృప్తినిస్తుంది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్వ్యూటర్ రంగాల వారికి సామాన్యం. నిరుద్యోగులకు అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించవలసి ఉంటుంది. మీ ఆశయసిద్ధికి నిరంతర శ్రమ, పట్టుదల అవసరమని గమనించండి. రోజులు భారంగా, మందకొడిగా సాగుతాయి.
మకరం : ప్రముఖుల సహకారంతో ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు అనుకూలిస్తాయి. నిత్యావసర వస్తు స్టాకిస్టులు, రేషన్ డీలర్లకు అధికారుల నుంచి వేధింపులు తప్పవు. అతిథి మర్యాదలు సమర్థంగా నిర్వహిస్తారు. విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలించవు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సంతృప్తి, పురోభివృద్ధి.
కుంభం : కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు అన్ని విధాలా కలిసిరాగలదు. దూర ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. రావలసిన ధనం అందటంతో ఆర్థికస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులకు ధ్యేయం పట్ల ఏకాగ్రత, కొత్త విషయాల పట్ల ఆసక్తి ఏర్పడతాయి. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి.
మీనం : హోటల్, క్యాటరింగ్ పనివారలు, వృత్తుల వారికి సంతృప్తి, పురోభివృద్ధి. స్త్రీలకు షాపింగ్‌లో ఏకాగ్రత ప్రధానం. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. సభ్యత్వాలు, పదవులు, కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. పారిశ్రామికవేత్తలకు అభ్యంతరాలు, అక్షేపణలు ఎదుర్కోవలసి వస్తుంది. అయిన వారే మీ తీరును తప్పుపడతారు.