Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అంతర్వేది, నెల్లూరు పెంచలకోన... లక్ష్మీనరసింహ స్వామి

హిరణ్యకశిపుని వధ కోసం నరసింహ అవతారం దాల్చిన శ్రీహరి, అసురసంహారం జరిగినా, ఆ ఉగ్రత్వాన్ని పోగొట్టుకోలేకపోతుండగా ఆ క్రోధాగ్ని జ్వాలలకు విశ్వం విధ్వంసం చెందుతుందేమోనని భయభ్రాంతులై దేవదేవులు, ప్రహ్లాదాది భక్తులు, నారదాది మునిపుంగవులు శాంతింపమని పలు విధా

Advertiesment
Sri Lakshminarasimha swami
, సోమవారం, 16 ఏప్రియల్ 2018 (22:00 IST)
హిరణ్యకశిపుని వధ కోసం నరసింహ అవతారం  దాల్చిన శ్రీహరి, అసురసంహారం జరిగినా, ఆ ఉగ్రత్వాన్ని పోగొట్టుకోలేకపోతుండగా ఆ క్రోధాగ్ని జ్వాలలకు విశ్వం విధ్వంసం చెందుతుందేమోనని భయభ్రాంతులై దేవదేవులు, ప్రహ్లాదాది భక్తులు, నారదాది మునిపుంగవులు శాంతింపమని  పలు విధాల స్తుతిస్తూ వేడుకున్నారు.
 
కానీ, ఆ మహోన్నత దేవుని ఉగ్రం ఎంతకూ శాంతినొందడం లేదు. అప్పుడు దేవదేవులు యోచించి, స్వామివారి ప్రతి అవతారం ప్రతీ జన్మలోనూ, స్వామివారికి ప్రియసతిగా ఉండే శ్రీ మహాలక్ష్మిని స్వామి చెంత చేర్చారు. తన శక్తిని పంచుకోగలది, తన హృదయాన్ని అధీష్టించగలదీ అయిన తన ప్రియ సతి తన చెంత చేరగానే, స్వామివారు సౌమ్యుడై శాంతమునొంది లక్ష్మీనరసింహుడిగా రాజోలు దగ్గర అంతర్వేదిలోనూ నెల్లూరు పెంచలకోనలోనూ ఇంకా పలు ప్రాంతాల్లోనూ వెలిశాడు. 
 
లక్ష్మీనరసింహస్వామిగా వెలసిన స్వామి భార్య ముఖ్యత్వాన్ని, భార్య విద్యుక్త ధర్మాన్ని మనకు తెలియజేయడంతో పాటు లక్షీసమేతంగా సకలైశ్యర్య శుభ ఫలితాలను ప్రసాదిస్తున్నాడు. చల్లని శాంత స్వరూపి లక్షీనరసింహస్వామిగా అభయమిస్తున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శెలవులు వచ్చేశాయ్... ఏ వారాలు, తిథుల్లో ప్రయాణిస్తే మంచిదో తెలుసా?