Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

18-04-2018 - బుధవారం మీ రాశి ఫలితాలు.. ఓర్పు, నేర్పుతో వ్యవహరించటం ఎంతైనా?

మేషం : మీ విజ్ఞత, నిజాయితీలకు ప్రశంసలు లభిస్తాయి. మీ మనసు మార్పును కోరుకుంటుంది. వ్యాపారాల్లో కష్టనష్టాలను కొంతమేరకు అధికమిస్తారు. కోర్టు వాదోపవాదాల్లో ప్లీడర్లకు మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రింట్, ఎ

Advertiesment
Daily Horoscope
, బుధవారం, 18 ఏప్రియల్ 2018 (06:50 IST)
మేషం : మీ విజ్ఞత, నిజాయితీలకు ప్రశంసలు లభిస్తాయి. మీ మనసు మార్పును కోరుకుంటుంది. వ్యాపారాల్లో కష్టనష్టాలను కొంతమేరకు అధికమిస్తారు. కోర్టు వాదోపవాదాల్లో ప్లీడర్లకు మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఏకాగ్రత చాలా అవసరం. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, ప్రోత్సాహం లభిస్తాయి.
 
వృషభం : ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులకు అనుకూలం. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. సొంతంగా వ్యాపారం, సంస్థలు స్థాపించాలనే మీ నిర్ణయం బలపడుతుంది. వాహనం నడుపునపుడు మెళుకువ అవసరం. నోటీసులు, రశీదులు అందుకుంటారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. 
 
మిథునం : ఎల్.ఐ.సి, పోస్టల్, ఇళ్ళ స్థలాల బ్రోకర్లకు, ఏజెంట్లకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. సంఘంలో మీ మాటపై నమ్మకం, గౌరవం పెరుగుతాయి. స్థిరాస్తుల కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి. వ్యవసాయదారులకు నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. మార్కెటింగ్ రంగంలోని వారికి ఒత్తిడి, శ్రమాధిక్యత తప్పవు.
 
కర్కాటకం : ఫైనాన్సు, చిట్స్ వ్యాపారులకు ఖాతాదారులతో సమస్యలు తలెత్తుతాయి. శ్రీవారు, శ్రీమతి విషయంలో మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది. ఓర్పు, నేర్పుతో వ్యవహరించటం ఎంతైనా అవసరం. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. చిన్నారులకు అనసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు.
 
సింహం : మీ సంతానం వివాహ, విద్యా విషయాలు ఆందోళన కలిగిస్తాయి. బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. ఉద్యోగ వ్యాపారాలలో ఆటుపోటు ఎదుర్కొనవలసివస్తుంది. వ్యాపారాభివృద్ధికి నూతన పథకాలు అమలు చేస్తారు. నూతన పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త అవసరం.
 
కన్య : విద్యార్థులు అత్యుత్సాహాన్ని అదుపులో ఉంచుకోవటం క్షేమదాయం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి. అనుకోకుండా వ్యాపార విషయమై ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. తలపెట్టిన పనులలో విఘ్నాలు, చీటికి మాటికి అసహనం ఎదుర్కుంటారు. 
 
తుల : ఉద్యోగస్తులకు అధికారిక పర్యటనలు, బాధ్యతల మార్పిడి వంటి ఫలితాలున్నాయి. దూరపు బంధువులను కలుసుకొని ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. బ్యాంకింగ్ రంగాల వారు ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానీయ వ్యాపారులకు అన్నివిధాలా కలిసివస్తుంది. 
 
వృశ్చికం: రాజకీయ నాయకులు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కాంట్రాక్టర్లకు నిర్మాణ పనుల్లో స్వీయ పర్యవేక్షణ ముఖ్యం. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి, అక్కౌంట్స్ రంగాల వారికి పనిభారం తప్పవు. ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత, ఇతరత్రా చికాకులు అధికమవుతాయి. 
 
ధనస్సు: వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. ఉద్యోగస్తులు సభలు, సమావేశాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. లాయర్లకు నిరుత్సాహం కానవస్తుంది. ఇతరులకు ఇచ్చిన ధనం తిరిగి రాబట్టుకోవటం సాధ్యం కాదని గమనించండి. పెంపుడు జంతువులపై ప్రేమ, శ్రద్ద చూపిస్తారు.
 
మకరం : సాంఘిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. టెక్నికల్, ఎలక్ట్రానికల్ రంగంలో వారికి కలసివచ్చేకాలం. ఓ మంచి వ్యక్తి అభిమానాన్ని పొందుతారు. వైద్యులు శస్త్రచికిత్స చేయునప్పుడు మెళకువ అవసరం. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రత్తి, పొగాకు రంగాలలో వారికి అనుకూలమైనకాలం.
 
కుంభం : శ్రమాధిక్యత, అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. బంధుమిత్రుల సలహాలు, హితోక్తులు మీపై మంచి ప్రభావం చూపుతాయి. భాగస్వామిక చర్చలు అర్థాంతంగా ముగుస్తాయి. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి అభద్రతా భావం, ఆందోళనలకు గురవుతారు. ప్రత్యర్థులు స్నేహ హస్తం అందిస్తారు.
 
మీనం : ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల పట్ల ఆసక్తి పెరుగును. మీ శ్రీమతికి మీకంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. వ్యవసాయ రంగంలో వారికి వాతావరణంలో మార్పు సంతృప్తినిస్తుంది. ప్రయాణాలలో అసౌకర్యానికి లోనవుతారు. హోటల్, క్యాటరింగ్ రంగాలవారికి లాభదాయకం. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులు తప్పవు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అక్షయ తృతీయ నాడు పేదలకు చెప్పులను దానం చేస్తే?