Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మీ అమ్మను అనగానే రోషమొచ్చిందా : పవన్‌పై విరుచుకుపడిన శ్రీరెడ్డి

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై నటి శ్రీరెడ్డి మరోమారు విరుచుకుపడింది. మీ అమ్మనంటే మీకు రోషమొచ్చిందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే అంశంపై ఆమె తాజాగా ఓ ట్వీట్ చేసింది.

Advertiesment
Sri Reddy
, శనివారం, 21 ఏప్రియల్ 2018 (11:01 IST)
అమ్మ ఎవరికైనా అమ్మేనని, మీ అమ్మని అనగానే బాధ అనిపిస్తే మరి మా తల్లుల సంగతేంటని నిలదీసింది. తన వెనక ఏ రాజకీయ పార్టీ లేదని, తనను ఎవరూ వెనకుండి నడిపించడం లేదని స్పష్టం చేసింది. పోరాటాలు చేస్తున్నట్టు నటించడం తనకు చేతకాదని ఎద్దేవా చేసింది.
 
అసలు ప్యాకేజీల కోసం పోరాటాలు చేసేది ఎవరో అందరూ గమనిస్తున్నారని పేర్కొంది. 'మీ అమ్మ మీకెంతో మా అమ్మ మాకూ అంతే'నని పేర్కొన్న శ్రీరెడ్డి.. తమని అన్నప్పుడు, తమ తల్లులను దూషించినప్పుడు, రోడ్డు మీద పడి రేప్‌లు చేస్తున్నప్పుడు, యాసిడ్ దాడులకు తెగబడుతున్నప్పుడు తమ బాధ అర్థం కాలేదా? అని ప్రశ్నించింది.
తాను అన్నింటికీ సిద్ధపడే పోరాటంలోకి దిగానని, ప్రాణాలకు సైతం లెక్క చేయనని శ్రీరెడ్డి స్పష్టం చేసింది. పవన్ తన ఆధిపత్యాన్ని సినిమాల్లో చూపించాలని, ఫిలిం చాంబర్‌పైన కాదని హితవు పలికింది. జర్నలిస్టుల జోలికి రావద్దని హెచ్చరించింది. ఏదో ఒకరోజ నిజాలు బయటకు వస్తాయని శ్రీరెడ్డి వ్యాఖ్యానించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీరెడ్డికి ఇంటర్ పూర్తయిన అమ్మాయి ఉందా? కళ్యాణి లీక్స్