Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తండ్రి పదే పదే చెప్పుతో కొట్టాడు.. ఆ బాధ తట్టుకోలేక బాలిక ఏం చేసిందంటే?

కారణం ఏంటో తెలియరాలేదు కానీ తండ్రి పెడుతున్న హింసను తట్టుకోలేని ఓ బాలిక టెర్రస్ నుంచి దూకేసింది. ఈ ఘటన రాజస్థాన్‌లో కలకలం రేపింది. తండ్రి పదే పదే కొట్టడం.. హింసించడం చేస్తుంటే 12 ఏళ్ల బాలిక తట్టుకోలేక

తండ్రి పదే పదే చెప్పుతో కొట్టాడు.. ఆ బాధ తట్టుకోలేక బాలిక ఏం చేసిందంటే?
, సోమవారం, 16 ఏప్రియల్ 2018 (10:43 IST)
కారణం ఏంటో తెలియరాలేదు కానీ తండ్రి పెడుతున్న హింసను తట్టుకోలేని ఓ బాలిక టెర్రస్ నుంచి దూకేసింది. ఈ ఘటన రాజస్థాన్‌లో కలకలం రేపింది. తండ్రి పదే పదే కొట్టడం.. హింసించడం చేస్తుంటే 12 ఏళ్ల బాలిక తట్టుకోలేకపోయింది. వందన అనే ఆ బాలికను ఆమె తండ్రి సంతోష్ పదే పదే కొట్టేవాడు. ఇదే తరహాలో ఆ బాలికను భవంతిపైకి తీసుకెళ్లిన సంతోష్.. పదే పదే చెప్పుతో కొట్టాడు.
 
ఆ బాధ నుంచి తప్పుకునేందుకు వందన..  భవంతి పైనుండి కిందకు దూకేసింది. ఈ ప్రమాదంలో ఆమెకు గాయాలు కాగా, హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంకా ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, సంతోష్‌ను అరెస్ట్ చేశారు. కుమార్తెను హింసించిన నేరానికి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒబామా-మానుషి చిల్లార్‌ను కలిస్తే రాయరు.. ఫేక్ న్యూస్‌ కోసం?: పూనమ్ కౌర్