Webdunia - Bharat's app for daily news and videos

Install App

షకీలా "లేడీస్ నాట్ అలౌడ్" చిత్రం Ladiesnotallowed వెబ్‌సైట్ ద్వారా జులై 20న విడుదల

Webdunia
గురువారం, 16 జులై 2020 (13:08 IST)
నటి షకీలా సమర్పణలో సాయిరామ్‌ దాసరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘లేడీస్‌ నాట్‌ ఎలౌడ్‌’. రమేష్‌ కావలి నిర్మిస్తున్నారు. విక్రాంత్‌ రెడ్డి సహ నిర్మాత. ఇదొక పూర్తిస్థాయి కామెడీ చిత్రం. దర్శకుడు సాయి రామ్ దాసరి తెరకెక్కించిన అడల్ట్ కామెడీ హారర్ సినిమా. సెన్సార్ వివాదంతో గడిచిన సంవత్సర కాలంగా థియేటర్ రిలీజ్‌కి నోచుకోలేని ఈ సినిమా ఇప్పుడు నేరుగా ఆన్లైన్లో విడుదల కానుంది.
 
జులై 20న ladiesnotallowed అనే వెబ్సైట్లో చిత్రం విడుదల కానుంది. సినిమా చూసేందుకు 50 రూపాయలు చెలించాల్సి ఉంటుందని చిత్ర బృందం తెలిపింది. వివరాలలోకి వెళ్తే.. తొలి ప్రైవేట్ పాటతోనే కాంట్రవర్సీ దర్శకుడిగా పేరు తెచ్చుకొని.. తొలి సినిమా నుండి తీసిన ప్రతి సినిమాతో ఏదో ఒక వివాదంలో సృష్టిస్తూ.. వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రెస్‌గా మారిన సాయి రామ్ దాసరి గత సంవత్సరం ప్రముఖ నటి షకీలా సమర్పణలో లేడీస్ నాట్ అలౌడ్ అనే సినిమాను తెరకెక్కించారు.
 
కానీ.. సెన్సార్ ఆ సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వలేదు. ఈ వివాదాని ఆయన ఢిల్లీ వరకు తీసుకెళ్లారు. కరోనా కారణంగా ఆ వివాద పరిష్కారం ఇప్పటికి ముగియలేదు. మరో పక్క సినిమా హాల్స్ మూతబడి ఇప్పటికే 100 రోజులు పైన గడిచింది. ఇప్పట్లో సినిమా హాల్స్ తెరుచుకునే అవకాశం కూడా లేకపోవడంతో సినిమాను నేరుగా ఆన్లైన్లో విడుదల చేసేందుకు చిత్ర బృందం నిర్ణయించుకుంది.
 
ఇప్పటికే అందరూ ఓ.టి.టిలలో సినిమాను విడుదల చేస్తుంటే.. రొటీన్‌గా చేస్తే ఏముంది అనుకున్నారో ఏమో గాని తొలిసారిగా తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమాకు ఒక వెబ్సైట్ చేసి నేరుగా అందులో చిత్రాన్ని విడుదల చేయనున్నారు. సినిమా చూసేందుకు ప్రేక్షకులు 50 రూపాయులు చెలించాల్సి ఉంటుంది. ఈ సినిమాను జులై 20న రాత్రి ఎనిమిది గంటలకు విడుదల చేస్తున్నట్లు దర్శకుడు సాయి రామ్ దాసరి తెలిపారు.
 
ఈ వారం సినిమా ప్రోమోషన్ చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు షకీలా తెలిపారు. ఈ సినిమాను కావలి రమేష్, విక్రాంత్ రెడ్డి, షకీలా సంయుక్తంగా నిర్మించారు. శ్రీ మిత్ర సంగీతం అందించగా.. తరుణ్ కరంథోద్ సినిమాటోగ్రఫీ చేశారు. కె.ఆర్.స్వామి ఈ సినిమాకు ఎడిటర్‌గా చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments