Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వెక్కివెక్కి ఏడ్చిన షకీలా... ఎందుకంటే?

వెక్కివెక్కి ఏడ్చిన షకీలా... ఎందుకంటే?
, శుక్రవారం, 14 ఫిబ్రవరి 2020 (22:15 IST)
షకీలా.. ఈమె గురించి పరిచయం అస్సలు అక్కర్లేదు. ఒకప్పుడు సెక్సీ హీరోయిన్‌గా షకీలాకు మంచి పేరే ఉంది. షకీలా సినిమా వచ్చిందంటే చాలు యువకులందరూ క్యూలైన్లో నిలబడేవారు. హౌస్ ఫుల్ బోర్డులే షకీలా సినిమా ప్రదర్సితమవుతున్న థియేటర్ల వద్ద కనిపించేవి. అయితే అలాంటి షకీలా ప్రస్తుతం పెద్దగా సినిమాల్లో నటించడం లేదు. ఆమెకు అవకాశాలు కూడా రావడం లేదు. 
 
ఈ మధ్య షకీలా ఒక ఇంటర్వ్యూలో తాను ఎదుర్కొన్న ఒక సంఘటనను గుర్తుచేసుకుంటూ తీవ్రంగా కన్నీంటి పర్యంతమైంది. నా సొంత అన్న పెళ్ళికి నన్ను పిలిచారు. అన్న పెళ్ళే కదా వెళ్ళాను. అయితే నా తల్లిదండ్రులే నన్ను సరిగ్గా పట్టించుకోలేదు. అందుకు కారణం మీకు పెద్దగా చెప్పనక్కర్లేదు. నేను నటించిన సినిమాలే.
 
అయితే అన్న పెళ్ళిలో నేను కొద్దిసేపు నిలబడగానే, అన్నను పెళ్ళిచేసుకోబోయే యువతి లేచి వెళ్ళిపోయింది. నాకేమీ అర్థం కాలేదు. అంతలో వాష్ రూంకు వెళ్ళాను. నేను అలా వెళ్ళానో లేదో మళ్ళీ పెళ్ళికూతురు వచ్చి పీటలపై కూర్చుంది. నేను వాష్ రూం నుంచి మండపానికి వస్తున్న సమయంలో నా తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చారు. నువ్వు ఇక్కడకు రావద్దంటూ సైగలు చేశారు. దీంతో నాకు అర్థమైంది. నేనంటే పెళ్ళి కూతురుకు ఇష్టం లేదని బాగా అర్థం చేసుకున్నాను. ఏడుపు ఆపుకోలేకపోయాను. గుక్కపడ్చి ఏడ్చేశాను. 
 
రెండు సంవత్సరాల తరువాత నాకు నా అన్న భార్య ఫోన్ చేసింది. బాగున్నావా అని అడిగింది. నేనంటే నీకు ఇష్టం లేదు కదా నాకెందుకు ఫోన్ చేశావని అడిగాను. దీంతో ఆమె ఏడుస్తూ మీ అన్న నన్ను వదిలేశాడు. నాకు న్యాయం చేయండి అంటూ బోరున విలపించింది. నేను నా తల్లిదండ్రులు, అన్నతో మాట్లాడి చాలా కాలమైంది. ఈ విషయం నీకు తెలుసు అని ఫోన్ పెట్టేశానని ఇంటర్వ్యూలోను షకీలా కన్నీటిపర్యంతమైంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అలా చేస్తే నా మొగుడు నన్ను వదిలేస్తానన్నాడు: యాంకర్ అనసూయ