మహేష్ బాబు నాకు తమ్ముడు లాంటోడు. బన్నీ ఎవరో తెలియదు.. షకీలా

ఆదివారం, 9 ఫిబ్రవరి 2020 (17:25 IST)
శృంగారతార షకీలా గురించి ప్రత్యేకంగా ఎవరికీ చెప్పనక్కర్లేదు. ఆమె పేరు తెలియని వారంటూ వుండరు. ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న ఆమెకు ప్రస్తుతం క్రేజ్ తగ్గిపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో షకీలా బన్నీ ఎవరో తెలియదని చెప్పేసింది. 
 
టాలీవుడ్‌‌లో మహేష్ బాబు నా తమ్ముడు లాంటోడు. బన్నీ ఎవరో నాకు తెలియదు..అంటూ వ్యాఖ్యానించింది. దీంతో సోషల్ మీడియాల్లో బన్ని ఫ్యాన్స్ ఈమెపై నిప్పులు చెరుగుతున్నారు. బన్నీ ఎవరో తెలియదా… తెలుగులో సినిమాలు చేసిన నీకు బన్నీ తెలియదని అంటావా అంటూ ఓ రేంజ్‌లో కామెంట్స్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
 
షకీలా కామెంట్‌పై బన్నీ అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు షకీలా నిజాయతీగా ఒప్పుకుందని మెచ్చుకుంటున్నారు. అల్లు అర్జున్‌కు.. మాలీవుడ్‌లో ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ ఎక్కువనే విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆయన నటించిన చాలా సినిమాలు మలయాళంలో కూడా విడుదలయ్యాయి. అలాంటిది బన్నీ ఎవరో తెలియదని షకీలా చెప్పడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం #KGFChapter2 రవీనా టాండన్ ఎంట్రీ.. ట్రిపుల్ ఆర్‌తో పోటీపడుతుందా?