దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేజీఎఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాకు ప్రస్తుతం సీక్వెల్ వచ్చేస్తోంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ రెండో భాగాన్ని ఛాప్టర్ 2గా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులోనూ యష్‌నే హీరో. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్‌దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
తాజాగా మరో బాలీవుడ్ సీనియర్ కథానాయిక రవీనా టాండన్ ఈ సినిమాలో నటిస్తున్నట్లు సినీ యూనిట్ ప్రకటించింది. గతంలో రవీనా కన్నడ చిత్రం ఉపేంద్రలో ఉపేంద్రతో కలిసి నటించింది. కన్నడలో మళ్లీ ఇన్నేళ్ల తర్వాత నటిస్తుంది. దీంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగిపోతున్నాయి.
ఇటీవల రవీనాను కలిసిన ప్రశాంత్ నీల్ ఆమెను ఒక పాత్ర కోసం సంప్రదించారట. కేజీఎఫ్ సినిమాకు ఉన్న క్రేజ్ కారణంగా వెంటనే నటించేందుకు ఒప్పేసుకుందట. ఇకపోతే.. కేజీఎఫ్ 2 చిత్రం ఆర్ ఆర్ ఆర్ చిత్రం ఖాళీ చేసిన జులై 30 - 2020వ తేదీన వచ్చే అవకాశం ఉంది అంటూ ప్రచారం జరుగుతుంది. దీంతో కేజీఎఫ్ 2 చిత్రం స్టార్ కాస్ట్ విషయంలో ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంతో పోటీ పడుతున్నట్లుగా అనిపిస్తుందని సినీ పండితులు అంటున్నారు.