Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

షకీల రాసిన మొట్టమొదటి కుటుంబ కథా చిత్రం..

Advertiesment
Shakeela Rasina Motta Modati Kutumba Katha Chitram
, మంగళవారం, 9 జూన్ 2020 (19:26 IST)
Shakila
శృంగార తార షకీలా ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపించి మంచి గుర్తింపు సంపాదించుకుంటోంది. 'షకీల రాసిన మొట్టమొదటి కుటుంబ కథా చిత్రం' పేరిట ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. విక్రాంత్‌, పల్లవి ఘోష్‌ జంటగా నటిస్తున్నారు. సి.హెచ్‌.వెంకట్‌రెడ్డి నిర్మాత. కాన్సెప్ట్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ సాయిరాం దాసరి, నవ్యమైన కథాంశంతో రూపుదిద్దుకున్న ఈ మూవీ ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. 
 
పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకొని సెన్సార్‌లో ఉన్న ఈ సినిమా నేడు సెన్సార్ బోర్డ్ ముందుకు వచ్చింది. అయితే సినిమాకు క్లీన్ యూ సర్టిఫికెట్ వచ్చింది. అటు షకీలా సినీ ప్రస్థానంలో కానీ ఇటు సాయి రామ్ దాసరి సినీ జీవితంలో ఇదే తొలి క్లీన్ యూ సర్టిఫికెట్ సినిమా. కేవలం "జగన్ అన్న" అనే ఒక పదం మ్యూట్ తప్ప ఎటువంటి కట్లు, మ్యూట్లు లేవు, అని తెలపడం ఆశ్చర్యానికి గురిచేసింది.
 
తన ప్రతి సినిమా విడుదలకు ముందు ఏదో ఒక కాంట్రవర్సీతో వార్తల్లోకెక్కే సాయి రామ్ దాసరి.. క్లీన్ యూ సర్టిఫికెట్ సినిమా తియ్యడం ఇప్పుడు టాక్ ఆఫ్ ఫిల్మ్ నగర్ అయ్యారు. ఈ సినిమాకు సి.హెచ్. వెంకట్ రెడ్డి నిర్మిత. లండన్ గణేష్ సహా నిర్మాత. మధు పొన్నస్ సంగీత దర్శకులు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ కళ్యాణ్ కోసం రామోజీ ఫిలిమ్ సిటీలో భారీ సెట్