కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న చిత్రం `సెబాస్టియన్` పి.సి.524. రేచీకటి నేపథ్యంలోని కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న కామెడీ థ్రిల్లర్. ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో జ్యోవిత సినిమాస్ పతాకంపై ప్రమోద్-రాజు లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలాజీ సయ్యపురెడ్డిని దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సిద్దారెడ్డి, జయచంద్రా రెడ్డి లు సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. నమ్రతా దారేకర్, కోమలి ప్రసాద్ హీరోయిన్లు గా నటిస్తున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 25 న విడుదలవుతుంది.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు బాలాజీ సయ్యపురెడ్డి మాట్లాడుతూ, ఇంతకుముందు టాక్సీవాలా, ద్వారక సినిమాలకి పని చేశాను. ఆ తర్వాత నేను ఒక కొత్త కథ రాసుకొని చాలామందికి చెప్పడం జరిగింది.అయితే నా మ్యుచివల్ ఫ్రెండ్ ద్వారా కిరణ్ ను కలసి కథ చెప్పడం జరిగింది."సెబాస్టియన్ష అనే కానిస్టేబుల్ ను తనకున్న నైట్ బ్లైండ్నెస్ ద్వారా తను ఎం ఇబ్బందులను ఎదుర్కొన్నాడనే కథను చెప్పిన వెంటనే కథ బాగుందని ఈ సినిమా చేద్దామన్నాడు. మదనపల్లె రూరల్ బ్యాక్ డ్రాప్ లో చేయడం నాకు కొత్తగా అనిపించింది. 32 రోజుల్లో ఏకధాటిగా షూటింగ్ చేసి పూర్తి చేసుకున్నాం. సినిమా చాలా బాగా వచ్చింది. సినిమా చూస్తున్న మీకు కిరణ్ కనిపించడు సెబాస్టియన్ కనిపించేలా చాలా ఎక్స్ట్రార్డినరీ పర్ఫార్మెన్స్ చేశాడు. ఈ కథ రాసుకున్నప్పుడే జిబ్రాన్ మ్యూజిక్ ఇమేజింగ్ చేసుకును కథ రాసుకోవడం జరిగింది.ఇందులోని ఆర్ట్ వర్క్ రియలిస్టిక్ గా ఉంటుంది అన్నారు.
హీరో కిరణ్ ఆబ్బవరం మాట్లాడుతూ, యస్ ఆర్. కళ్యాణమండపం షూట్ లో ఈ కథ చెప్పారు. సెబా అనే క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అని ఈ కథను 15 నిమిషాలు వినగానే నచ్చి ఒప్పుకున్నాను. ఈ సినిమాను తెలుగు, తమిళ్ లో కూడా చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. సెబాస్టియన్ అనే క్యారెక్టర్ చాలామందికి గుర్తుండిపోతుంది. ఎందుకంటే `చంటి` సినిమా లో బ్రహ్మానందం గారు 15 నిమిషాలు రేచీకటి క్యారెక్టర్ చేస్తేనే అందరూ ఎంతో ఎంజాయ్ చేశారు. అలాంటిది ఈ క్యారెక్టర్ చేస్తే బాగుంటుందని ఈ క్యారెక్టర్ ను చాలెంజ్ గా తీసుకుని చేస్తున్నాను.సెబాస్టియన్ సినిమా ప్రేక్షకులను 100% ఎంటర్టైన్ చేస్తుంది. ఈ సినిమా కోసం మేమంతా ప్రేక్షకుల తీర్పు ఎలా ఉండబోతోందని చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నాం. సినిమా చాలా బాగా వచ్చింది.ఇలాంటి క్యారెక్టర్ నాకు ఇంత తొందరగా దొరకడం నా అదృష్టం. సెబా క్యారెక్టర్ నేను ఎన్ని సినిమాలు చేసినప్పటికీ నా కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మదనపల్లిని కొత్తగా చూయించారని అన్నారు.
సహ నిర్మాత సిద్దారెడ్డి మాట్లాడుతూ, సినిమా మొత్తం మదనపల్లిలో షూట్ చేశాము.మేము అనుకున్న దానికంటే మంచి ఔట్ ఫుట్ వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఈ నెల 25 విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అన్నారు.
నిర్మాత నాగరాజు మాట్లాడుతూ, అందరి సహకారంతో 32 రోజుల్లో అనుకున్న బడ్జెట్ లో సినిమా కంప్లీట్ చేశాం. జీబ్రాన్ మ్యూజిక్ సినిమాకు హైలెట్ గా నిలుస్తుంది. ఇలాంటి టెక్నిసిషన్స్ దొరికితే చిన్న నిర్మాతలను సేవ్ చేసిన వారవుతారు. ఈ నెల 25 న వస్తున్న ఈ సినిమా అందరినీ కచ్చితంగా అలరిస్తుందని అన్నారు.
ఎడిటర్ విప్లవ్ మాట్లాడుతూ.. సెబాస్టియన్ అనే మూవీ నాకు స్పెషల్ ప్రాజెక్ట్. కిరణ్ చాలా చక్కగా నటించాడు. బాలాజీ గారు ఫస్ట్ నుండి ప్రేక్షకులకు కొత్త కథను ఇవ్వాలని ఈ సినిమాను కొత్తగా తీశాడు.డి.ఓ.పి వర్క్ చాలా బాగుంది.త్వరలో వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని అన్నారు.
డి.ఓ.పి.రాజ్ కె.నల్లి మాట్లాడుతూ...ఈ సెబాస్టియన్ సినిమా రెగ్యులర్ గా ఉండదు. డీఫ్రెంట్ గా ఉంటుంది.సినిమా చాలా బాగా వచ్చింది.ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది అన్నారు.