రాయలసీమ ప్రజలకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సారీ చెప్పారు. కడప ఎయిర్ పోర్టు వ్యవహారంపై ప్రాణాలు తీసేసే వాళ్ల జిల్లాలో కూడా ఎయిర్‌పోర్ట్ అవసరమా అన్నట్లు సోమువీర్రాజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. 
 
									
			
			 
 			
 
 			
					
			        							
								
																	
	 
	దీంతో సోము వీర్రాజుపై రాయలసీమకు చెందిన నేతలు మండిపడ్డారు. ప్రజల నుంచి కూడా నిరసన వ్యక్తం కావడంతో ఆయన వివరణ ఇచ్చారు. శనివారం క్షమాపణలు చెప్పారు. 
 
									
										
								
																	
	 
	ప్రభుత్వ తీరును విమర్శించే క్రమంలో తాను వాడిన పదాలు రాయలసీమ ప్రజల మనసులను గాయపరిచాయన్నారు. అందుకే తాను కడప జిల్లా గురించి తాను మాట్లాడిన మాటలన్నింటినీ వెనక్కి తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు. 
 
									
											
							                     
							
							
			        							
								
																	
	 
	"రాయలసీమ రతనాల సీమ" అనే పదం తన హృదయంలో పదిలంగా ఉంటుందని తెలిపారు. రాయలసీమ ఇంకా అభివృద్ధి చెందాలని తాను అనేక  వేదికలపై ప్రస్తావించానన్నారు. 
 
									
			                     
							
							
			        							
								
																	
	 
	రాయలసీమకు నికర జలాలు, పెండింగ్ ప్రాజెక్టులపై తను పోరాటం చేశానని, అభివృద్ధి ఇంకా వేగవంతం కావాలని కోరుకుంటున్నానని ఆకాంక్షించారు.