తన బ్రా సైజులకు దేవుడికి లింకుపెడుతూ నటి శ్వేతా తివారీ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారాన్నే రేపాయి. దీంతో ఆమెపై మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఆమెను అరెస్టు చేసేందుకు సమాయత్తమవుతున్నారు.
ఈ క్రమంలో శ్వేతా తివారీ కిందికి దిగివచ్చారు. తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఆమె నష్ట నివారణ చర్యలు ఉపక్రమించింది. తన వ్యాఖ్యలు ఎవరినీ బాధపెట్టాలని చేసినవి కావని, కానీ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నందున క్షమాపణలు చెబుతున్నానని ఓ ప్రకటన చేసింది.
తన సహ నటుడు గతంలో చేసిన పాత్రను ఉద్దేశించి తాను వ్యాఖ్యానించగా, దాన్ని తప్పుగా అన్వయించుకున్నారని శ్వేతా తివారీ వివరణ ఇచ్చారు. సాధారణంగా నటులను వారు పోషించిన పాత్రల పేరుతో పిలుస్తుంటారని, వ్యాఖ్యలు కూడా ఆ కోణంలో చేసినవేనని వెల్లడించింది. అయితే, తాను దేవుడ్ని విశ్వసిస్తానని, దేవుడి పేరిట ఎవరినీ నొప్పించేందుకు ప్రయత్నించనని స్పష్టం చేసింది.