Webdunia - Bharat's app for daily news and videos

Install App

సరిలేరు నీకెవ్వరు సెన్సార్ టాక్ ఏంటి..?

Webdunia
శుక్రవారం, 3 జనవరి 2020 (15:12 IST)
సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా సక్సస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం సరిలేరు నీకెవ్వరు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి.ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
అవుట్‌ అండ్‌ అవుట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి నటించారు. ఇప్ప‌టికే విడుదలైన టీజర్‌, సాంగ్స్‌కి టెర్రిఫిక్‌ రెస్పాన్స్‌ వస్తోంది. కాగా సరిలేరు నీకెవ్వరు చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్ పొందింది. 
 
ఈ సినిమాని చూసిన సెన్సార్ టీమ్ మెంబర్స్ చిత్ర యూనిట్‌ని ఎంతగానో అభినందించారట. ఖచ్చితంగా విజయం సాధిస్తుందని చెప్పి ముందుగానే అభినందనలు తెలియచేసారట. 
 
జనవరి 5 ఆదివారం సాయంత్రం 5:04 నిమిషాలకు హైద‌రాబాద్ లాల్‌బహదూర్‌ స్టేడియంలో మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా అభిమానుల సమక్షంలో గ్రాండ్‌గా ‘సరిలేరు నీకెవ్వరు మెగా సూపర్‌ ఈవెంట్`ను నిర్వహించి సంక్రాంతి కానుక‌గా ప్రపంచ వ్యాప్తంగా విడుద‌ల‌ చేయ‌నున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అవమానభారం భరించలేక ఇద్దరు పిల్లలను చంపేసి తాను కూడా...

బాలీవుడ్ నటుడు సైఫ్‌కు వారసత్వ ఆస్తులు దక్కేనా?

భిక్షం వేసి బుక్కయ్యారు... పోలీసుల కేసు నమోదు

తెనాలి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో రూ.2వేల కరెన్సీ నోట్లు

విజనరీ నేత చంద్రబాబును కలవడం సంతోషంగా ఉంది : బిల్ గేట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి అల్లం గురించి తెలుసా? అది తింటే ఏమవుతుంది?

కరకరమనే అప్పడాలు, కాళ్లతో తొక్కి మరీ చేస్తున్నారు (video)

తులసి టీ తాగితే ఈ సమస్యలన్నీ పరార్

శీతాకాలంలో జీడిపప్పును ఎందుకు తినాలి?

కోడికూర (చికెన్‌)లో ఈ భాగాలు తినకూడదు.. ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments