Webdunia - Bharat's app for daily news and videos

Install App

''శాకుంతలం''లో శకుంతలగా సమంత... దుష్యంతుడిగా ఎవరు..?

Webdunia
శుక్రవారం, 8 జనవరి 2021 (11:30 IST)
దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో ''శాకుంతలం'' సినిమా తెరకెక్కుతోంది. రుద్రమదేవి సినిమాకు తర్వాత గుణశేఖర్ తీయబోయే సినిమా ఇదే కావడం గమనార్హం. శకుంతల-దుష్యంతుడి లవ్ స్టోరీని తెరకెక్కించబోతున్నాడు ఈ దర్శకనిర్మాత.

అయితే.. ఈ మూవీలో శకుంతల పాత్ర కోసం పలువురు హీరోయిన్లను సంప్రదించాడు గుణశేఖర్. చివరకు సమంత ఓకే అయ్యింది. సమంత లాంటి నటి శకుంతల పాత్రలోకి రావడంతో ఈ సినిమా టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.
 
అయితే.. ఈ 'శాకుంతలం' సినిమా ప్రకటించడానికి ముందు రానా దగ్గుబాటితో ఓ చిత్రాన్ని అనౌన్స్ చేశాడు గుణశేఖర్. అది కూడా పౌరాణిక చిత్రమే కావడం గమనార్హం. 'హిరణ్యకశ్యప' అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశాడు. కానీ.. ఏమైందో తెలియదు ఆ సినిమాకు బ్రేక్ ఇచ్చి ఈ అందమైన ప్రేమ కావ్యాన్ని ఫ్రేమ్ లోకి తెచ్చాడు దర్శకుడు.
 
ఈ క్రమంలోనే 'శాకుంతలం' సినిమా ప్రకటించడం.. టైటిల్ మోషన్ పోస్టర్ విడుదల చేయడం జరిగిపోయాయి. ''వెండితెరపై 'హిరణ్య కశ్యప'లో నరసింహావతారాన్ని సాక్షాత్కరింపజేసే ముందు.. భారతాన ఆదిపర్వంలోని ఆహ్లాదకర ప్రేమకథని ఆవిష్కరిస్తూ.." అని మోషన్ పోస్టర్‌ని రిలీజ్ చేశాడు గుణశేఖర్.
 
ఈ సినిమాలో 'శకుంతల'గా సమంతను ఫైనల్ చేయడంతో ఇప్పుడు అందరి దృష్టీ.. రాజు దుష్యంతుడిపైనే పడింది. శకుంతల ప్రేమికుడు దుష్యంతుని పాత్రలో నటించబోయే ఆ నటుడు ఎవరా? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

ఈ సినిమాను పాన్ ఇండియన్ మూవీగా మలచాలని భావిస్తున్న గుణశేఖర్.. మలయాళం లేదా తమిళ హీరోను దుష్యంతుడి పాత్రకు తీసుకోవాలని చూస్తున్నాడట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైజాగ్, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులను మూడేళ్లలో పూర్తి చేస్తాం.. నారాయణ

పరీక్ష రాసేందుకు వెళ్తే స్పృహ కోల్పోయింది.. కదులుతున్న ఆంబులెన్స్‌లోనే అత్యాచారం

నా మేనేజర్‌తో నా భార్య మాట్లాడింది కూడా రేవంత్ రెడ్డి ట్యాప్ చేసిండు: కౌశిక్ రెడ్డి (video)

మరొకరితో ప్రియురాలు సన్నిహితం, నువ్వు అందంగా వుండటం వల్లేగా అంటూ చంపేసాడు

తిరుమల ఘాట్ రోడ్డు.. సైకిల్‌పై వెళ్తున్న జంటపై చిరుత దాడి వీడియో వైరల్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments