Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భార్య సమంతను వద్దని చెప్పిన చైతూ..? ఎందుకు..?

Advertiesment
Naga chaitanya
''మజిలీ'' సినిమాతో మంచి విజయం అందుకొని భారీ గ్యాప్ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్ స్టోరీ' అనే సినిమాలో నటిస్తున్నాడు. నేచురల్ బ్యూటీ సాయిపల్లవి నాగచైతన్య సరసన నటిస్తుంది. గతేడాది విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇక మనం వంటి అద్భుతమైన సినిమా అందించిన విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో చైతూ ఒక సినిమా ఓకే చేసిన సంగతి తెలిసిందే. 
 
అలాగే ఈ సినిమాకు 'థాంక్యూ' అనే టైటిల్ ఖరారు చేసినట్లు ప్రకటించారు. త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. మనం లాంటి సూపర్ హిట్ తర్వాత ఆ రేంజి హిట్ మళ్లీ కొట్టలేదు విక్రమ్. నిజానికి హిట్ అనేదే ఆయనకు కరువైందని చెప్పాలి. కాబట్టి ఈ 'థాంక్యూ' సినిమా ఆయనకు చాలా కీలకం కాబోతుంది.
 
దిల్ రాజు నిర్మాణంలో రూపొందనున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవరినేది ఇంకా ఫైనల్ కాలేదు. రకుల్ ప్రీత్ సింగ్ పేరు వినిపించింది కానీ కాదని తేలింది. అయితే తాజాగా సమంత అయితే బాగుంటుందని మేకర్స్ సూచిస్తే.. నాగచైతన్య వెంటనే వద్దు అని చెప్పేసాడట.
 
ఎందుకంటే సామ్ - చైతూలు కలిసి రీసెంట్‌గా మజిలీ చేశారు. మళ్లీ అదే కాంబో అయితే బాగోదని చైతూ వేరే హీరోయిన్ని చూడమని చెప్పినట్లు సమాచారం. మరి ఈ సినిమాకు హీరోయిన్ ఎవరో తెలియాలంటే వేచి చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సమంతను వద్దంటున్న నాగచైతన్య - మరో అమ్మాయిపై కన్ను?