Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆఫర్లు నిల్.. ఎక్స్‌పోజింగ్ పుల్.. శ్రియ తంటాలు!

Webdunia
శుక్రవారం, 8 జనవరి 2021 (11:08 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో అనేక మంది అగ్రహీరోలతో నటించిన నటి శ్రియ. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున వంటి అగ్ర హీరోలతో పాటు.. కుర్ర హీరోలతోనూ జోడీకట్టింది. ఆ తర్వాత ఈ అమ్మడికి అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఇపుడు ఒకటి రెండు ఆఫర్లు మాత్రమే వస్తున్నాయి. 
 
అలాగే తమిళంలోనూ ఈ అమ్మడుకు ఆఫర్లు ఒక్కటంటే ఒక్కటికూడా లేదు. దీంత కోలీవుడ్‌లో తట్టాబుట్టా సర్దుకుంది. కానీ, 2007లో సెన్షేషనల్‌ డైరెక్టర్‌ శంకర్‌ - సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘‘శివాజి - ది బాస్‌’’ చిత్రంలో ఆమెకు బంపర్‌ ఆఫర్‌ వచ్చింది. 
 
పైగా ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కనకవర్షం కురిపించింది. దీంతో శ్రియ కోలీవుడ్‌లో వరుస ఆఫర్లు వస్తాని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ, ఆమెకు నిరాశే ఎదురైంది. ఆమె వైపు నిర్మాతలు కన్నెత్తి కూడా చూడలేదు. దీంతో శ్రియ తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లోకి వెళ్ళిపోయింది.
 
అయితే, తాను ఇంకా ఉన్నానని కోలీవుడ్‌ ప్రేక్షకులకు గుర్తు చేసేందుకు అపుడప్పుడు ఈ ముద్దుగుమ్మ... కురచ దుస్తుల్లో ఫొటోలకు ఫోజులిస్తూ వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తోంది. వాటిని చూసిన ఆమె అభిమానులు.. ఒక్క నిర్మాత నుంచి పిలుపు రాకపోవడంతో ఎక్స్‌పోజింగ్‌నే నమ్ముకుందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం శ్రియకు ఇతర భాషల్లో కూడా పెద్దగా అవకాశాలు లేవనే చెప్పాలి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో విషాదం.. పెళ్లి కాలేదని రైలుకిందపడి వైద్యుడి ఆత్మహత్య

తెలంగాణాలో రేపటి నుంచి బెండు తీయనున్న ఎండలు!

అక్రమ సంబంధం పెట్టుకున్న భార్యకు ప్రియుడితో పెళ్లి చేసిన భర్త (Video)

పాకిస్థాన్ సైన్యంలో తిరుగుబాటు : ఆర్మీ చీఫ్‌కి జూనియర్ల వార్నింగ్

తిరుపతిలో వ్యర్థాలను ఏరుకునే వారి కోసం ట్రాన్స్‌ఫర్మేటివ్ ప్రాజెక్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments