Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పోర్ట్స్ బిజినెస్‌లోకి సమంత.. మహిళలు ఎదురుచూస్తున్నారు..

సెల్వి
బుధవారం, 21 ఆగస్టు 2024 (11:21 IST)
స్పోర్ట్స్ బిజినెస్‌లోకి హీరోయిన్ సమంత దిగింది. మాజీ టెన్నిస్ క్రీడాకారుడు గౌరవ్ నటేకర్‌తో కలిసి వరల్డ్ పికెల్ బాల్ లీగ్‌లో పార్ట్నర్‌గా చెన్నై ఫ్రాంజైజ్‌ని తీసుకుంది. ఈ విషయాన్ని సమంత అధికారికంగా ప్రకటించింది. 
 
ఈ ఫ్రాంచైజ్ తీసుకున్నందుకు థ్రిల్ ఫీలవుతున్నాను అంటూ గౌరవ్ తో కలిసి దిగిన ఫొటోని సమంత షేర్ చేసింది. గ‌త సంవ‌త్స‌రం ఖుషి, శాకుంత‌లం సినిమాల్లో క‌నిపించిన ఆమె తాజాగా న‌టించిన సిటాడెల్ అనే వెబ్ సిరీస్ రిలీజ్ కావాల్సి ఉంది. 
 
ఇకపోతే.. ఇటీవ‌ల కోల్‌కతాలో ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో జూ. డాక్టర్‌పై జరిగిన హత్యాచార ఘటనపై సమంత స్పందించింది. మహిళల భద్రతకు తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సిన సమయం ఆసన్నమయింది. 
 
మహిళలు మార్పు కోసం ఎదురుచూస్తున్నారని, ఇప్పుడది అవసరం కూడా అని ఈ మార్పు త్వరలోనే వస్తుందని ఆకాంక్షిస్తున్నానని సామ్ తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి షాకిచ్చిన కోర్టు

జనసేన సంస్థాగత బలోపేతం కోసం త్రిశూల్ వ్యూహం : పవన్ కళ్యాణ్

బీహార్‌లో ఒక్క ఓటు కూడా చోరీ కానివ్వం : రాహుల్ గాంధీ

యూపీఎస్పీ అభ్యర్థుల కోసం ప్రతిభా సేతు పోర్టల్

ఏలూరు జిల్లాలో కానిస్టేబుల్‌ అదృశ్యం.. ఫోన్‌ సిగ్నల్‌ కట్‌!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments